
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక చాలా శ్రమ ఉంది. ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌ను పిలిచి వాళ్లతోనే చేయించడం జరిగింది. ఈ పాట థియేటర్‌లో ఒక తాండవంలా ఉంటుంది. ఇండియన్ సినిమాలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే ఒక ఫ్యామిలీ డ్రామాను ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా నేను చూడలేదు. ఇది నా గత సినిమాల్లాగా లైట్‌హార్టెడ్‌గా ఉంటుందని అనుకోవద్దు. చాలా సీరియస్‌గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది అని అన్నారు.
అలాగే చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషన్ ఉంటుంది. రవితేజ గారి సినిమాల్లో చాలా త్వరగా షూటింగ్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆయన గ్యాప్ తీసుకోరు, ఎవరికీ గ్యాప్ ఇవ్వరు. సీలేరులో అన్ని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ గారు అందరూ ఈ కథను నమ్మి పనిచేశారు. రవితేజ లాంటి అద్భుతమైన పెర్ఫార్మర్‌తో ‘ఇరుముడి’ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్‌ను మరోసారి చూడాలనిపించేలా ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. ప్రియాకు ఇందులో మూడు సీన్లు ఉన్నాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు థియేటర్‌లో చూస్తారు.
అదేవిధంగా సాయికుమార్ గారు తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు. ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నక్షత్ర అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు వస్తాయి. రవితేజ గారికి, నక్షత్రకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాగే అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే జీవీ ప్రకాష్ కుమార్ గారి సంగీతాన్ని ఇష్టపడుతున్నాను. ఈ సినిమాకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేను. డీఓపీ విష్ణు శర్మ నా రైట్ హ్యాండ్. సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీరు ప్రత్యేకంగా రాస్తారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా సీరియస్ ఫిలిం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్‌తో పాటు గొప్ప ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకుని వస్తారు అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.