Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Maa Inti Bangaram: మా ఇంటి బంగారం ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా
Maa Inti Bangaram Trailer

Updated on: May 25, 2026 | 10:32 PM

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సరికొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సమంతతో ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోమవారం (మే 25) రాత్రి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ లో సమంత చాలా కొత్తగా కనిపించింది. ఒకవైపు అమాయకపు కోడలిగా, మరోవైపు గూండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అండర్‌ వరల్డ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మహిళగా అదరగొట్టింది.  ‘నా ప్రాణం అడ్డుపెట్టైనా ..నా ఫ్యామిలీ కి ఏమి కాకుండా చూస్కుంటా’ అని సామ్ నోట నుంచి వచ్చిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.  కాగా మా ఇంటి బంగారం సినిమాను సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మిస్తోంది. అలాగే సామ్ భర్త, ప్రముఖ దర్శకుడు  రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథను అందించడం విశేషం.  ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మాఇంటి బంగారం సినిమాలో సమంతతో పాటు  దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు  పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన తస్సాదియ్యా సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

సమంత మా ఇంటి బంగారం ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us