బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు కొన్ని రోజులుగా హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని లారెన్స్ బిష్ణోయ్ వర్గం సల్మాన్ ను చంపేస్తామని ఇదివరకు చాలాసార్లు బెదిరింపులు లేఖలు పంపించింది. అలాగే బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిగాయి. ఇక ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ తోపాటు పలువురు బీటౌన్ స్టార్స్ కు ముంబై పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇదిలా ఉంటే.. నిన్న మంగళవారం సల్మాన్‌ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. నిన్న ఉదయం ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. “రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేదంటే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను” అని బెదిరింపు రావడంతో వర్లీ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354 (2) , 308 (4) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ ప్రారంభంలో ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఇలాంటి బెదిరింపు సందేశం వచ్చింది. ఐదు కోట్లు ఇస్తే సల్మాన్ ను చంపకుండా వదిలేస్తామని.. లేదంటే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చంపేస్తామని బెదిరించారు. ఇప్పుడు రెండు కోట్లు డిమాండ్ చేశారు.
కొన్ని నెలలుగా ఇలాంటి బెదిరింపులు ఎక్కువ కావడంతో సల్మాన్ ఖాన్ ను భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు సల్మాన్ ఖాన్, NCP నాయకుడు జీషన్ సిద్ధిఖీని చంపుతానని బెదిరించాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని నోయిడాలో అరెస్ట్ చేశారు. బాంద్రా ఈస్ట్‌లోని జీషన్ సిద్ధిఖీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయానికి ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 12న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సల్మాన్ ఖాన్ కు అత్యంత ఆప్త మిత్రుడు కావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ కు ఎవరు సహాయం చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.