Atlee Kumar: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అట్లీ పాన్ ఇండియా సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

మొన్నటివరకు తమిళంలో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఆయన గతేడాది 'జవాన్‌' సినిమాతో హిందీలో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఇప్పుడు సౌత్, బాలీవుడ్ స్టార్ హీరోలను కలిపి అట్లీ కొత్త సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లోనూ.. ఇటు తమిళ్ లోనూ భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అట్లీ నెక్స్ట్ సినిమా దళపతివిజయ్ తో ఉంటుందని అంతా అనుకున్నారు.

Atlee Kumar: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అట్లీ పాన్ ఇండియా సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
Atlee
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:32 AM

తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లీకి తమిళ్, తెలుగులోనే హిందీలోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొన్నటివరకు తమిళంలో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఆయన గతేడాది ‘జవాన్‌’ సినిమాతో హిందీలో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఇప్పుడు సౌత్, బాలీవుడ్ స్టార్ హీరోలను కలిపి అట్లీ కొత్త సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లోనూ.. ఇటు తమిళ్ లోనూ భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అట్లీ నెక్స్ట్ సినిమా దళపతివిజయ్ తో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ లోగా ఆయన మరో ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఓ మల్టీ స్టారర్, మూవీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

కమల్‌హాసన్‌ , సల్మాన్‌ ఖాన్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘జవాన్‌’ తర్వాత దర్శకుడు అట్లీ కొత్త సినిమా చేయలేదు. అట్లీ తదుపరి ప్రాజెక్ట్ గురించి అందరూ ఆసక్తిగా ఉన్నారు. అట్లీ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నందున, అతని నెక్స్ట్ సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని అందుకు తగిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. అట్లీ గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నాడు. తాజాగా దీనిపై ఓ గాసిప్‌ వినిపించింది. ఈ ప్రాజెక్ట్‌లో కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఈ వార్తతో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

అట్లీ అద్భుతమైన యాక్షన్ సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేశారు. అలాగే సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ కూడా యాక్షన్ సినిమాలతో అభిమానులను అలరించారు. ఈముగ్గురి కలయికలో అదిరిపోయే సినిమా వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మించనుంది.  సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Atlee Kumar (@atlee47)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే..
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..