Renu Desai: సినిమాల్లోకి అకీరా నందన్ ఎంట్రీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?

|

Jan 05, 2025 | 5:11 PM

ప్రముఖ నట రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ , నిర్మాతగా, డైరెక్టర్ గా ఆమె సత్తా చాటారు. అయితే పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

Renu Desai: సినిమాల్లోకి అకీరా నందన్ ఎంట్రీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?
Renu Desai, Akira Nandan
Follow us on

పెళ్లి, పిల్లల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రేణూ దేశాయ్ 2023 లో రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు విడుదలై ఏడాదిన్నర గడిచినా ఇప్పటివరకు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదీ అందాల తార. ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలతో రేణూ దేశాయ్ బిజి బిజీగా ఉంటోంది. అనాథ పిల్లలు, పర్యావరణం, మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తుంటుంది. అలాగే తన ఫాలోవర్స్‌ని కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. ఇటీవలే మూగ జీవాల కోసం తన కూతురు ఆద్య పేరు మీదగా ఒక ఎన్‌జీవోను కూడా స్థాపించింది రేణూ దేశాయ్. కాగా చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంది. మొదట ఇంద్ర కీలాద్రి అమ్మారిని దర్శించుకున్న ఆమె సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యిందామె. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘మీ కుమారుడు అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నాడు’ అని రేణూను అడిగారు. దీనికి స్పందించిన ఆమె..

‘ ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒక తల్లిగా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి’ అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

ఇవి కూడా చదవండి

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో రేణూ దేశాయ్..

కాగా పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమాలో అకీరా నందన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుజిత్ తెరకక్కిస్తోన్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ చిన్నప్పటి రోల్ అకీరా పోషిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.