రేణు దేశాయ్.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా తన పిల్లలు అకిరా, ఆద్యలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటారు. ఇటీవలే అకిరా కర్రసాము చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తన ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలంటూ కోరింది. రేణు దేశాయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరలయ్యింది. ఆకస్మాత్తుగా రేణు దేశాయ్ విరాళాలు కావాలని అడగమేంటీ.. ? అసలు ఏం జరిగింది.. ? ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందా ? అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. తాజాగా తన ఇన్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయి. పూర్తి వివరాలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ఇన్ స్టాలో విరాళాలు కావాలని పోస్ట్ పెట్టింది నేను అంటూ క్లారిటీ ఇచ్చింది. తన అకౌంట్ హ్యాక్ కాలేదని.. అలాగే విరాళాలు అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. కొద్దిరోజులుగా తన ఆరోగ్యం బాలేనందున ఈ వీడియో చేయలేకపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. “కొద్ది రోజులుగా నా ఆరోగ్య బాలేదు. అందుకే వీడియో చేయలేదు. కానీ రూ.3500 కావాలంటూ పోస్ట్ పెట్టింది మాత్రం నేను. నా అకౌంట్ ఎవరు హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్ గా డొనేట్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్ కు నా డబ్బులంతా ఇచ్చేస్తే.. నా పిల్లల కోసం కావాలి కదా.. నా వరకు సాయం చేశాక.. ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నాను.. యానిమల్స్, చిన్నారుల కోసం నేను విరాళాలు ఇస్తున్నాను. అదే నా ఫైనల్ టార్గెట్. త్వరలోనే వాటి కోసం ఓ షెల్టర్ నిర్మిస్తాను. అప్పుడు నేను అందరిని అధికారికంగా విరాళాలు సేకరిస్తాను. నా రిక్వెస్ట్ కు రియాక్ట్ అయ్యి రూ. 3500 పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. కొన్నాళ్ల క్రితం మాస్ మాహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తిరిగి అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.