Rashmika Mandanna : ప్రతిక్షణం నాకు తోడుండాలి.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..

|

Dec 18, 2024 | 12:21 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రేమ, రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna : ప్రతిక్షణం నాకు తోడుండాలి.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..
Rashmika Mandanna
Follow us on

పుష్ప 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇటీవల కాస్మోపాలిటన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనలాంటి మనస్తత్వం ఉన్న భాగస్వామి కావాలని .. తన జీవితంలోకి రాబోయే లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు రష్మిక కామెంట్స్ వైరలవుతున్నాయి. నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోనూ తోడుండాలి. అన్ని వేళలా నాకు భద్రతనివ్వాలి. జీవితంలోని కష్టసమయంలో నాకు సపోర్ట్ చేయాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. శ్రద్ధ వహించాలి. అలాగే మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండే జీవితమంతా కలిసి ఉండొచ్చు” అని చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలి. నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడిదుడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు ఉండాలి అని చెప్పుకొచ్చింది.

పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది రష్మిక. దీంతో ఈ అమ్మడుకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కొద్ది రోజుల క్రితమే యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటుంది రష్మిక. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది రష్మిక.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు భారీ బడ్జెట్ చిత్రాలు.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కాస్మోపాలిటన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె ప్రేమ, రిలేషన్ లో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

 

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.