
రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రకింగ్ తాలూకా.. ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా పై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక సినిమా బాగుందని.. చాలా కాలం తర్వాత రామ్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటున్నారు. రామ్ నటన సినిమాకే హైలైట్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు\. అలాగే ఎట్టకేలకు రామ్ హిట్ కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు. మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు రామ్ పోతినేని.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.