ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించింది బాహుబలి. ప్రభాస్ హీరోగా రానా ప్రతినాయకుడిగా నటించిన బాహుబలి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లను సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Baahubali Crown Of Blood
Follow us

|

Updated on: May 02, 2024 | 7:49 PM

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించింది బాహుబలి. ప్రభాస్ హీరోగా రానా ప్రతినాయకుడిగా నటించిన బాహుబలి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లను సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ సంచలన విజయాన్ని అందుకుంది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి పార్ట్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ముగించారు రాజమౌళి. దాంతో పార్ట్ 2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అనుకున్నట్టుగానే బాహుబలి 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాహుబలి సినిమాను ఏనిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఓటీటీలో ఈ యానిమేటెడ్ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్పనున్నారు. బాహుబలి 2 ప్రీక్వెల్ గా వస్తున్న కథ ఇది. . ఇందులో కట్టప్పనే విలన్ గా చూపించారు. కాగా.. రక్తదేవ్ అనే శతృవు సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న ఆ కట్టప్పను ఎదుర్కోవడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలుపుతారు.

ఈ యాక్షన్ సిరీస్ హాట్‌స్టార్ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ బాహుబలికి రాజమౌళి దర్శకుడిగా చేశారు.. ఈ బాహుబలికి రాజమౌళి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ఈ యానిమేటెడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ యానిమేటెడ్ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.