పూరి గారి డాటర్..హీరోయిన్ ఫీచర్స్..

|

Mar 16, 2020 | 4:14 PM

పూరి జగన్నాథ్..చలన చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. రెండు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకోవడం ఆయనకే చెల్లుతుంది. సోసైటి చెంపపై లాగి పెట్టి కొట్టి..మీరు చేసేది తప్పు అని చెప్తాడు పూరి. బుల్లెట్లలాంటి డైలాగ్స్‌ను డైరెక్ట్‌గా మైండ్‌లోకి దించేస్తాడు. ఆయన పడిలేచిన కెరటం. పాజిటీవ్ వైబ్రేషన్. హిట్టు, ప్లాపులతో పనిలేదు. నమ్ముకున్న ఇండస్ట్రీలో నచ్చిన పనిచేస్తూ బ్రతుకుతున్నామా..? లేదా..? అనేది ఆయన టార్గెట్. ఇలా పూరి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. అందుకే […]

పూరి గారి డాటర్..హీరోయిన్ ఫీచర్స్..
Follow us on

పూరి జగన్నాథ్..చలన చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. రెండు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకోవడం ఆయనకే చెల్లుతుంది. సోసైటి చెంపపై లాగి పెట్టి కొట్టి..మీరు చేసేది తప్పు అని చెప్తాడు పూరి. బుల్లెట్లలాంటి డైలాగ్స్‌ను డైరెక్ట్‌గా మైండ్‌లోకి దించేస్తాడు. ఆయన పడిలేచిన కెరటం. పాజిటీవ్ వైబ్రేషన్. హిట్టు, ప్లాపులతో పనిలేదు. నమ్ముకున్న ఇండస్ట్రీలో నచ్చిన పనిచేస్తూ బ్రతుకుతున్నామా..? లేదా..? అనేది ఆయన టార్గెట్. ఇలా పూరి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. అందుకే ఇప్పడు ఆయన డాటర్ పవిత్ర పూరి గురించి మాట్లాడుకుందాం.

పవిత్ర పూరి..బాహుబలి ప్రభాస్, త్రిష జోడిగా నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.  ఆ తర్వాత ఇక ఏ సినిమాలో కనిపించలేదు. అయితే ఎప్పటికప్పుడు ఆమె తనకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేస్తోన్న ఫోటోస్ చూస్తోన్న కొందరు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సమయం ఆస్నమైందంటూ చెప్పుకొస్తున్నారు. కాస్త స్లిమ్ అయితే ఇంకా సూపర్ అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. మరి ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలియాలి. ఆమెకు తెరంగేట్రం చేయాలని ఇంట్రస్ట్ ఉంటే మాత్రం పూరి జగన్నాథ్ అస్సలు అడ్డుచెప్పే వ్యక్తి కాదు. ఇప్పటికే ఆకాశ్ పూరి హీరోగా రాణిస్తున్నాడు. ఈ కుర్రోడు నటిస్తోన్న ‘రొమాంటిక్’ మూవీ మే 29 న రిలీజ్ కాబోతుంది.