Allu Aravind- Ayaan: క్రికెట్ ఆడిన తాత మనవడు.. అల్లు అయాన్ ధనా ధన్ బ్యాటింగ్ అదుర్స్ అంతే.. వీడియో వైరల్

|

Aug 12, 2024 | 2:37 PM

నిర్మాతగా ఎప్పుడు సినిమా పనులతో బిజీ బిజీగా ఉండే అల్లు అరవింద్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఆదివారం (ఆగస్టు 12) కావడంతో సరదాగా మనవడు అల్లు అయాన్ తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వయసు సహకరించకున్నా మనవడి కళ్లల్లో ఆనందం నింపడం కోసం బౌలింగ్ వేయడమే కాకుండా పరుగులు పెడుతూ ఫీల్డింగ్ చేశారు

Allu Aravind- Ayaan: క్రికెట్ ఆడిన తాత మనవడు.. అల్లు అయాన్ ధనా ధన్ బ్యాటింగ్ అదుర్స్ అంతే.. వీడియో వైరల్
Allu Ayaan, Allu Aravind
Follow us on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్‌ది ప్రత్యేక స్థానం. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు. గీతా ఆర్ట్స్ సంస్థ అధినేతగ స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. నిర్మాతగా ఎప్పుడు సినిమా పనులతో బిజీ బిజీగా ఉండే అల్లు అరవింద్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఆదివారం (ఆగస్టు 12) కావడంతో సరదాగా మనవడు అల్లు అయాన్ తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వయసు సహకరించకున్నా మనవడి కళ్లల్లో ఆనందం నింపడం కోసం బౌలింగ్ వేయడమే కాకుండా పరుగులు పెడుతూ ఫీల్డింగ్ చేశారు. ఇక తాత బౌలింగ్ వేస్తుంటే.. అల్లు అయాన్ మాత్రం ధోనీ తరహాలో ధనా ధన్‌ బ్యాటింగ్ తో భారీ షాట్లు ఆడాడు. దీంతో బాల్ ను పట్టుకునేందుకు అల్లు అరవింద్ చాలా చెమటోడ్చాల్సి వచ్చింది. ఇలా తాత మనవడి క్రికెట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది. బన్నీ కొడుకు బ్యాటింగ్ అదరగొడుతున్నాడని, తాత మనవళ్లు క్రికెట్ ఆడుతుంటే చూడముచ్చటగా ఉందని అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి, కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హలకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. అయాన్, అర్హల అల్లరి పనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది అల్లు స్నేహా రెడ్డి. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక అల్లు అర్హ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలంలో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాలోనూ అర్హ నటిస్తుందని ఆ మధ్యన ప్రచారం జరిగింది. హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో బన్నీ గారాల పట్టి మెరవనుందని పుకార్లు వినిపించాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవి కూడా చదవండి

 

తాతా మనవళ్ల క్రికెట్.. వీడియో ఇదిగో..

అల్లు అరవింద్ ను పరుగులు పెట్టించిన అల్లు అయాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.