ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలంగా సినీ పరిశ్రమలో సైలెంట్‌గా ఉన్న ఆయన.. శుక్రవారం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయన రెండో భార్య హిమానీ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నెలల కూతురు, సెకండ్ భార్య, తండ్రి సుందరం మాస్టర్‌లో కలిసి శ్రీవారి వీఐపీ విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. సాధారణ భక్తులతో కలిసి క్యూలైనులో నిలబడి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన సమయంలో పాపను ఆయన రెండో భార్య ఎత్తుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు.
అటు మాడవీధుల్లో ప్రభుదేవా నడకకు ఇబ్బంది కలిగిస్తూ సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై జనాలను పక్కకు నెట్టడంతో తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయారు ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతారతో ప్రేమాయణం.. పెళ్లి వరకు వచ్చిన వీరు ఆ తర్వాత విడిపోయారు.
నయనతారను పెళ్ళి చేసుకోవడానికి ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ సమయంలో రాంలత ప్రభుదేవాపై కోర్టుకు వెళ్లింది. నయనతారతో పెళ్లి వరకు వచ్చి విడిపోయిన అనంతరం.. 2020లో డాక్టర్ హిమానీ సింగ్ ను వివాహం చేసుకున్నారు ప్రభుదేవా. వీరికి ఇటీవలే ఓ పాప జన్మించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.