Prabhas : ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. అక్కడ ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. థియేటర్లలో అమ్మాయిల రచ్చ చూశారా.. ?

|

Oct 20, 2024 | 10:50 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి ప్రాజెక్టుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. త్వరలోనే తన నెక్ట్స్ సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

Prabhas : ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. అక్కడ ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. థియేటర్లలో అమ్మాయిల రచ్చ చూశారా.. ?
Prabhas
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రభాస్‏కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డార్లింగ్ సినిమాలు విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా పండగ చేసుకుంటారు. విదేశాల్లో ఇప్పటివరకు విడుదలైన ప్రభాస్ సినిమాలన్ని భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు ఉన్న రెస్పాన్స్ గురించి తెలిసిందే. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలకు అభిమానులు ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ముందుగానే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు జపాన్ ఫ్యాన్స్.

ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో డార్లింగ్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇక జపాన్ దేశంలో మాత్రం డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా జపాన్ లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాను రీరిలీజ్ చేసి అడ్వాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే రాధేశ్యామ్ రీరిలీజ్ థియేటర్లలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని రచ్చ చేశారు. హ్యాప్పీ బర్త్ డే ప్రభాస్ అంటూ పెద్ద పెద్ద బ్యానర్స్ పట్టుకుని థియేటర్లలో హడావిడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సలార్, మిస్టర్ పర్ఫెక్ట్, ఈశ్వర్ చిత్రాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థియేటర్లలో డార్లింగ్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. మరోవైపు ప్రభాస్ బర్త్ డే రోజున తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ వస్తాయని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.