Ram Charan: రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఫైటర్.. జీతం అన్ని లక్షలా?

గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెంట ఓ కొత్త బాడీ గార్డ్ కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో 'బీస్ట్' లా కనిపిస్తోన్న ఇతని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. అయితే ఈ బాడీ గార్డ్ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు.

Ram Charan: రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఫైటర్.. జీతం అన్ని లక్షలా?
Ram Charan

Updated on: May 25, 2026 | 8:25 PM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ తర్వాత భోపాల్, బెంగళూరు నగరాల్లోనూ పెద్ది ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్స్ అన్నింటికీ హాజరవుతున్నాడు. అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్ పక్కన ఒక భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షింస్తోంది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ వెన్నంటే ఉంటూ అతనికి రక్షణ కవచంలా నిలుస్తున్నాడతను. అయితే ఆ బీస్ట్ రామ్ చరణ్ కొత్త బాడీ గార్డ్ అని తెలిసింది. అతని పేరు కెవిన్ కుంట. ప్రస్తుతం పెద్ది ఈవెంట్స్ ఫొటోలు, వీడియోల్లో రామ్ చరణ్ లుక్స్ తో పాటు ఈ బాడీ గార్డ్ వీడియలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఎవరీ కెవిన్ కుంట అని ఆరా తీస్తే అతని గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MMA) ఫైటర్‌గా రాణిస్తున్నాడు. అక్కడ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా నిలిచిన కెవిన్ కు బాడీ గార్డ్ గా భారీ డిమాండ్ ఉందని త తెలుస్తోంది.  ముఖ్యంగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు, VVIPలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించడం కోసం కెవిన్ ను పట్టు బట్టి మరీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణకు బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడీ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్. ముంబై ఈవెంట్ లో వేలాది మంది జనాలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒకేసారి ఎగబడినప్పుడు కెవిన్ నియంత్రించిన విధానం హైలెట్ గా నిలిచింది. అయితే ఈ బాడీగార్డ్ జీతం కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెవిన్ కు రోజుకు రూ. 2 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

బెంగళూరు పెద్ది ప్రమోషన్స్ ఈవెంట్ లో రామ్ చరణ్ వెంట కొత్త బాడీ గార్డ్ కెవిన్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us