Dil Raju : పద్మ శ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు ఆర్థిక సాయం అందించిన దిల్ రాజు

|

Feb 04, 2024 | 10:56 AM

తాజాగా అలాంటి అంతరించిపోతున్న కళను గుర్తించింది కేంద్రప్రభుత్వం. బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యంతో పాటలు పడుతూ.. ఉంటారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన కొండప్ప బుర్రవీణ వాయిస్తూ బిక్షాటన చేస్తూ ఉన్నారు'.

Dil Raju : పద్మ శ్రీ అవార్డు  గ్రహీత దాసరి కొండప్పకు ఆర్థిక సాయం అందించిన దిల్ రాజు
Dil Raju
Follow us on

అంతరిచిన కళలు ఎన్నో ఉన్నాయి.. అలాగే అంతరించిపోయేందుకు చివరి దశలో ఉన్న కళలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో బుర్రవీణ వాయిద్యం ఒకటి. తాజాగా అలాంటి అంతరించిపోతున్న కళను గుర్తించింది కేంద్రప్రభుత్వం. బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యంతో పాటలు పడుతూ.. ఉంటారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన కొండప్ప బుర్రవీణ వాయిస్తూ బిక్షాటన చేస్తూ ఉన్నారు’. తాతల కాలం నాటి నుంచి ఆయన కుటుంబం ఇదే చేస్తున్నారు. అయితే కొండప్ప కళను గుర్తించిన నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మించిన బలగం సినిమాలో ఓ పాట పడేందుకు అవకాశం ఇచ్చారు.

నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమాలో కొండప్ప ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటను ఆలపించారు కొండప్ప. ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు కొండప్పను ఆఫీసు కు పిలిపించారు. పద్మశ్రీ ప్రకటించడంతో కొండప్పను సన్మానించి గౌరవించారు దిల్ రాజు.

దిల్ రాజుతో పాటు బలగం సినిమా దర్శకుడు వేణు కూడా కొండప్పను అభినందించారు. ఆతర్వాత కొండప్పను ఆర్థికంగా ఆదుకున్నారు దిల్ రాజు. కొండప్పకు లక్షరూపాయలు చెక్కును అందించారు. ఆ డబ్బును తనకోసం మాత్రమే వాడుకోవాలని దిల్ రాజు కొండప్పకు చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..