Aadhi Pinisetty and Nikki Galrani: పెళ్లిపీటలెక్కనున్న ప్రేమ పక్షులు.. ఆది, నిక్కీ పెళ్లి ఎప్పుడంటే..

ఇటీవల చాలా మంచి హీరోలు పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో హీరో కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో హీరోగా నటిస్తూనే మరో వైపు ప్రతినాయకుడి పాత్రల్లోనూ అలరిస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి.

Aadhi Pinisetty and Nikki Galrani: పెళ్లిపీటలెక్కనున్న ప్రేమ పక్షులు.. ఆది, నిక్కీ పెళ్లి ఎప్పుడంటే..
Nikki Galrani And Aadhi Pin
Follow us

|

Updated on: May 08, 2022 | 5:45 PM

ఇటీవల చాలా మంచి హీరోలు పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో హీరో కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో హీరోగా నటిస్తూనే మరో వైపు ప్రతినాయకుడి పాత్రల్లోనూ అలరిస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty). హీరోగా రాణిస్తూనే మరో వైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఆది పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ పోతినేని వారియర్ కోసం మరోసారి విలన్ గా మారాడు. ఇదిలా ఉంటే ఆది తన కో స్టార్ హీరోయిన్ నిక్కి గల్రానీ(Nikki Galrani)ని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరూ నిశ్చితార్థం కూడా కంప్లీట్ అయ్యిందంటూ ఎంగెజ్‏మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చారు.

తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. 2015లో విడుదలైన యాగవరైనమ్ నా కక్కా సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత మరగాధ నాణ్యం సినిమాతో ప్రేమగా మారింది. ఇక వీరి వివాహం ఈ నెల 18వ తేదీన చెన్నైలోని ఓ స్టార్  హోటల్లో అట్టహాసంగా జరగబోతోందట. ఈ పెళ్లి ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరగనుందని తెలుస్తుంది.ఇక 18వ తేదీ సాయంత్రమే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..