Nagarjuna: దటీజ్ నాగ్ సార్! ఆ అభిమానిని కలిసిన కింగ్.. మరోసారి క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో

|

Jun 26, 2024 | 5:34 PM

ముంబై ఎయిర్ పోర్టులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునను ఓ అభిమాని కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే నాగ్ సెక్యూరిటీ ఆ అభిమానిని తోసేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే దానికి కింగ్ నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా ఆ అభిమానిని నాగార్జున డైరెక్టుగా కలిశారు. మళ్లీ క్షమాపణలు చెప్పారు.

Nagarjuna: దటీజ్ నాగ్ సార్! ఆ అభిమానిని కలిసిన కింగ్.. మరోసారి క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
Nagarjuna
Follow us on

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ మధ్య అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇందులో నాగార్జున తప్పేమీ లేకపోయినా ఆయన బాడీ గార్డ్ అత్యుత్సాహం వలన చాలా మందితో మాటలు పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునను ఓ అభిమాని కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే నాగ్ సెక్యూరిటీ ఆ అభిమానిని తోసేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే దానికి కింగ్ నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా ఆ అభిమానిని నాగార్జున డైరెక్టుగా కలిశారు. మళ్లీ క్షమాపణలు చెప్పారు. అలాగే హగ్ చేసుకొని, ఒక సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే?

ఈ మధ్య కుబేర మూవీ కోసం నాగార్జున ముంబై వెళ్లాడు. ఇదే సినిమాలో నటిస్తున్న ధనుష్ తో కలిసి అక్కడి ఎయిర్ పోర్టులో కనిపించాడు. అయితే ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడైన అభిమాని నాగార్జునతో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. కానీ భద్రతా కారణాలతో నాగ్ పక్కనే ఉన్న అతని బాడీగార్డ్ ఆ అభిమానిని వెనక్కి లాగాడు. దీంతో ఆ అభిమాని కిందపడబోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. చాలా మంది కింగ్ నాగార్జునను తప్పు పట్టారు. అయితే ఈ విషయం గురించి లేటుగా తెలుసుకున్న నాగార్జున వెంటనే సదరు అభిమానికి వీడియో రూపంలో క్షమాపణలు చెప్పాడు. . అలా జరగాల్సింది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని కూడా హామీ ఇచ్చాడు. ఇప్పుడు అదే నాగ్ తనతో ఫొటో దిగడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

 అభిమానితో నాగార్జున.. వీడియో ఇదిగో..

బాడీ గార్డ్ అత్యుత్సాహంతో కింద పడబోయిన నాగార్జున ఫ్యాన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.