Nagarjuna : తారలు దిగివచ్చిన వేళ.. దసరా సంబరాల్లో బాలీవుడ్ స్టార్స్‌తో నాగార్జున, అమల

ఇక ఈ దసరా నాగార్జున కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. నాగ్ నటించిన ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nagarjuna : తారలు దిగివచ్చిన వేళ.. దసరా సంబరాల్లో బాలీవుడ్ స్టార్స్‌తో నాగార్జున, అమల
Nagarjuna, amala

Updated on: Oct 07, 2022 | 7:34 PM

ప్రతి ఏడాది లానే ఈసారి కూడా దసరా చాలా ఘనంగా జరిగింది. సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకు అంతా ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక సినిమా తరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వీరిలో అక్కినేని నాగార్జున కాందాన్ లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ఈ దసరా నాగార్జున కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. నాగ్ నటించిన ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సంబరాలు డబుల్ అయ్యాయి. అంతే కాదు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు తారలతో నాగ్ దసరా సెలబ్రేట్ చేసుకున్నారు. కళ్యాణ్ జ్యువల్లర్స్ కు సంబంధించి వివిధ భాషల్లో యాడ్స్ లో నటించిన తారలతో కలిసి దసరా సెలబ్రేట్ చేసింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వేడుకల్లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, స్నేహ, కళ్యాణి ప్రియదర్శన్, అమల, నాగార్జున, ప్రభు ఇలా అందరూ కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ డ్రస్ కోడ్ లో అందరు మెరిశారు. ఇక నాగ్ నటించిన ఘోస్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నాగ్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు నాగ్ .

Nagarjuna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us