Megastar Chiranjeevi: సిటీకి దూరంగా.. ఫ్యామిలీతో కలిసి సింపుల్‌గా చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్‌

| Edited By: Ravi Kiran

Aug 24, 2022 | 7:43 AM

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి సోమవారం(ఆగస్టు22)తో 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినిమాస్టార్లతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: సిటీకి దూరంగా.. ఫ్యామిలీతో కలిసి సింపుల్‌గా చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్‌
Megastar Chiranjeevi
Follow us on

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి సోమవారం(ఆగస్టు22)తో 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినిమాస్టార్లతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేసిన సందడి అంతఇంత కాదు. వాట్సప్‌ స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ మొత్తం చిరు బర్త్‌డే పోస్ట్‌లతో నిండిపోయాయి. ఈక్రమంలో తనకు బర్త్‌డే విషెస్‌ తెలిపన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. మరోవైపు తన స్పెషల్‌ డేను సింపుల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు మెగాస్టార్‌. నగరానికి దూరంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

కుటుంబంతో కలిసిన ఫొటోలు ట్విట్టర్‌లో పంచుకున్న చిరంజీవి..’ఈ పుట్టిన రోజును నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన ఈ క్షణాలు ఎంతో అద్భుతం’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు. ఈ ఫొటోల్లో చిరంజీవి సతీమణి సురేఖ, చెర్రీ- ఉపాసన, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, శ్రీజ.. ఇలా మెగా, అల్లు కుటుంబానికి చెందిన పలువురు హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, అల్లు అరవింద్‌ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు. కాగా బన్నీ భార్యతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..