Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. గద్దర్ అవార్డులపై ఏమన్నారంటే?

|

Jul 30, 2024 | 7:32 PM

తెలుగు సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. గద్దర్ అవార్డులపై ఏమన్నారంటే?
Megastar Chiranjeevi , CM Revanth Reddy
Follow us on

తెలుగు సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం (జులై 29) డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం విచారకరమన్న రేవంత్ రెడ్డి, దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమ‌న్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన చిరంజీవి.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ , సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని రాసుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

చిరంజీవి తన పోస్టుకు తెలంగాణ సీఎంవోను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లను ట్యాగ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదు.

కాగా గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి బిజీ, మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది ముందుకు సాగడం లేదన్నారు. ‘గద్దర్ అవార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవర్ని వెళ్లి కలవమన్నా కలుస్తాం. నేను కొన్ని కాగితాలు రెడీ చేశాను, నర్సింగరావు గారు కూడా తయారుచేసారు. మేము ఇద్దరం ట్రై చేసాం కానీ అపాయింట్మెంట్ రాలేదు. ఆ తర్వాత ఛాంబర్ నుంచి కొంతమంది వెళ్లి సీఎంని కలిశారు. అప్పుడు కూడా ఈ అవార్డుల గురించి మాట్లాడారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఇలా జరుగుతోంది’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.