Varun Tej: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మెగా హీరో.. పుట్టిన రోజున అంధ విద్యార్థులకు విరాళమిచ్చిన వరుణ్‌ తేజ్‌

|

Jan 20, 2023 | 6:07 AM

తన పుట్టిన రోజున ఒక మంచి పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు వరుణ్‌. కాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వరుణ్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్‌ నాగబాబు, దేవానర్ బ్లైండ్ స్కూల్ పిల్లలు హాజరయ్యారు.

Varun Tej: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మెగా హీరో.. పుట్టిన రోజున అంధ విద్యార్థులకు విరాళమిచ్చిన వరుణ్‌ తేజ్‌
Varun Tej Birth Day
Follow us on

మెగా హీరోల్లో వరుణ్‌ తేజ్‌ది విభిన్నమైన శైలి. సినిమా కథలు ఎంచుకోవడం దగ్గర నుంచి లైఫ్‌స్టైల్‌ వరకు అన్నింటా తనది ఓ సపరేట్‌ స్టైల్‌. అందుకే తనకంటూ ఓ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరచుకున్నాడు. కాగా ఈరోజు (జనవరి 19) వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు. సాధారణంగా మెగా హీరో బర్త్‌డేలంటే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే మెగా ప్రిన్స్‌ మాత్రం ఇలాంటి ఆడంబరాలకు కాస్త దూరంగానే ఉంటాడు. అయితే సేవా కార్యక్రమాల్లో మాత్రం తన పెద్ద నాన్న చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లనే ఫాలో అవుతుంటాడీ స్టార్‌ హీరో. తాజాగా తన పుట్టిన రోజున ఒక మంచి పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు వరుణ్‌. కాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వరుణ్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్‌ నాగబాబు, దేవానర్ బ్లైండ్ స్కూల్ పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులతో కలిసి నాగబాబు కేక్‌ కట్ చేసి వరుణ్ తేజ్ పుట్టినరోజుని స్పెషల్ గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అనంతరం దేవనార్ బ్లైండ్ స్కూల్ కోసం వరుణ్ పంపిన లక్ష రూపాయాల చెక్కును నాగబాబు అందజేశారు. ‘పిల్లల మధ్య ఇలా బర్త్ డే జరుపుకుంటే వారు కూడా చాలా సంతోష పడతారు. గతేడాది కూడా వరుణ్ ఇలాగే తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తను బయటకి చెప్పుకోడు. ఇప్పుడు కూడా ఈ స్కూల్ కి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చాడు. కాబట్టి మీరంతా మా వరుణ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటూ అతని దీవించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు నాగబాబు. కాగా గతేడాది దీపావళి సందర్భంగా ఇదే స్కూలు విద్యార్థులకు టపాసులు, స్వీట్లను బహుమతిగా పంపించాడు వరుణ్.

ముకుంద సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైన వరుణ్‌ ఆ ద్వారా కంచె సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత లోఫర్‌, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్‌2, గద్దల కొండ గణేశ్‌, ఎఫ్‌3 సినిమాలతో స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. వరుణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ ప్రకటించారు మూవీ మేకర్స్‌. సినిమాకు సంబంధించిన మోషన్‌ వీడియోతో పాటు వరుణ్‌ లుక్‌కు పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..