మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మంజుల

ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తేనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? రచ్చ రచ్చే.. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఇద్దరూ పెద్దగా బయట కనిపించారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మంజుల
Pawan Kalyan, Mahesh Babu
Follow us

|

Updated on: May 14, 2024 | 11:57 AM

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తేనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? రచ్చ రచ్చే.. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఇద్దరూ పెద్దగా బయట కనిపించారు. ఫంక్షన్స్ కు పెద్దగా హాజరుకారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అలాగే సామజిక సేవలు చేస్తూ ఉంటారు. అందుకే అభిమానులు ఈ ఇద్దరినీ తెగ ఆరాధిస్తూ ఉంటారు.

అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఉన్న సేమ్ క్వాలిటీ గురించి మహేష్ బాబు సోదరి మంజుల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఓల్డ్ వీడియో ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మంజుల.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మంచి హెల్దీ కాంపిటీషన్ ఉన్న స్టార్ హీరోలు. మహేష్ , పవన్ ఇద్దరూ  ఎప్పుడు తమ మనసు చెప్పిందే ఫాలో అవుతారు.  వాళ్లకు నచ్చిందే చేస్తారు. వాళ్లు ఎప్పుడు తమ లోకంలోనే ఉంటారు. నాకు ఇద్దరిలో చాలా పోలికలు కనిపిస్తాయి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు లైనప్ చేశారు పవన్.

View this post on Instagram

A post shared by Arjun Bharath (@gatthartv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles