ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభముహూర్తాలు ఉండడంతో ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ మొదలైన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఈ పెళ్లి బాజాలు మోగుతూనే ఉండనున్నాయి. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇటీవల దిల్ రాజు సోదరుని తనయుడు ఆశిష్ రెడ్డి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వివాహం కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ నటుడు పెళ్లిపీటలెక్కారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ నటునిగా గుర్తింపు తెచ్చుకున్న సుదేవ్ నాయర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు, ప్రముఖ నటి అమర్ దీప్ కౌర్ మెడలో మూడు ముళ్లు వేశాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గురువాయూర్ లో ఏడడుగులు నడించారు. కేరళ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే సుదేవ్- అమర్ దీప్ కౌర్ ల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువాయూర్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.
సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మలయాళంతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ దాదాపు 30కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల తెలుగులో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ చిత్రంలోనూ స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక పలు సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లోనూ ప్రధా న పాత్రలు పోషించాడు.