నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత మలయాళం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో హనీ రోజ్ చాలా పాపులర్ నటి. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది.
సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. హనీ రోజ్ చేసిన అన్ని ఫోటోషూట్‌లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ అమ్మడు సినిమాలతో కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే కాలం గడిపేస్తోంది. తాజాగా ప్రారంభోత్సవాలకు వెళ్లడంపై హనీ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివాహాలకు హాజరవడం కంటే ప్రారంభోత్సవాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతానని హనీ చెప్పింది. దాంతో అందరూ అవాక్ అవుతున్నారు. ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియని అయోమయం తరచుగా ఉంటుంది. ఫంక్షన్ కోసం డ్రెస్ ముందుగానే డిజైన్ చేయించుకోవాలి. ఏదైనా వేడుకలు వస్తే ముందుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కు అలా కాదు కారులో కూర్చొని ప్రారంభోత్సవం చేయబోయే షాపు వివరాలు తెలుసుకుంటా అని చెప్పుకొచ్చింది.
ఓపెనింగ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తా.. మన కోసం ఎదురుచూసే జనాలను చూడటం , వారి ప్రేమను పొందడం నాకు చాలా ఇష్టం. మేము ప్రారంభించబోయే దుకాణం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది. వెల్ కమ్ చెబుతూ ఆయన ప్రారంభించే సంస్థకు మమ్మల్ని ఆహ్వానించడం ఓ విశేషం. నాకు ఆ వైబ్ అంటే చాలా ఇష్టం. కానీ అందరితో కలిసి పెళ్లికి వెళ్లడం నాకు చాలా కష్టం. అవార్డు షోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయితే ప్రారంభోత్సవానికి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలని నాకు అనిపించదు అని చెప్పుకొచ్చింది హనీ రోజ్. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.