Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

| Edited By: Rajeev Rayala

Aug 17, 2023 | 7:57 AM

బాలయ్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఒరిజినల్ కంటెంట్ నమ్ముకుంటూ.. బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్స్‌తో ఈయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. అప్పట్లో 40 కోట్లున్న మార్కెట్ కాస్తా ఇప్పుడు 100 కోట్లకు రీచ్ అయిపోయింది. తాజాగా భగవంత్ కేసరిపై అంచనాలు మరింత పెరిగాయి.. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Bhagavanth Kesari
Follow us on

ఇప్పుడు రీమేక్ అనే మాట వింటేనే మండి పడుతున్నారు ప్రేక్షకులు.. ఫ్యాన్స్ అయితే వద్దు బాబోయ్ వద్దు అంటున్నారు. అది ఏ హీరో అయినా నో రీమేక్ అంటున్నారంతే. ఇలాంటి సమయంలో భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం జోరందుకుంది. అది విన్న బాలయ్య ఫ్యాన్స్ గుండెల్లో జెట్ స్పీడ్‌లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత..? బాలయ్య కూడా రీమేక్‌తోనే వస్తున్నారా..? దీనిపై చిత్రయూనిట్ ఏమంటుంది..?

బాలయ్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఒరిజినల్ కంటెంట్ నమ్ముకుంటూ.. బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్స్‌తో ఈయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. అప్పట్లో 40 కోట్లున్న మార్కెట్ కాస్తా ఇప్పుడు 100 కోట్లకు రీచ్ అయిపోయింది. తాజాగా భగవంత్ కేసరిపై అంచనాలు మరింత పెరిగాయి.. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భగవంత్ కేసరి రీమేక్ అని వస్తున్న వార్తలతో బాలయ్య ఫ్యాన్స్‌కు కంగారు మొదలైంది. అయితే అందులో అది నిజం కాదని.. ఆ వార్తలన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసారు నిర్మాతలు. అభిమానులు ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని దైర్యం చెప్పారు. ఇది స్వామి రీమేక్ కాదు.. అసలు నిజం ఏంటో అక్టోబర్ 19న థియేటర్లలో చూస్తారు అని తెలిపారు నిర్మాతలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.