సినీ ఇండస్ట్రీలో కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చేసుకుంటున్నారు. కానీ మరికొంతమంది హీరోయిన్స్ మాత్రం హిట్ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అలంటి భామల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కేతిక శర్మ గురించే.
రొమాంటిక్ సినిమా తర్వాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య అనే సినిమాలో చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఆ వెంటనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా అనే ఫ్యామిలీ సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా అమ్మడికి కలిసి రాలేదు.
చివరిగా వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ కు జోడిగా బ్రో సినిమాలో నటించింది కేతిక శర్మ. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో కేతిక కెరీర్ డైలామాలో పడింది. సాలిడ్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ మేరకే మేకర్స్ ను ఆకర్షించేలా సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
బ్రో సినిమా పైన ఆశలు పెట్టుకున్నాకూడా ఈ అమ్మడికి తగిన గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది అక్కడ అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.