Samantha Ruth Prabhu : స్టైలిష్ సమంత.. సోషల్ మీడియాలో అమ్మడి అదిరిపోయే లుక్స్

|

Aug 17, 2023 | 7:34 AM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడికి నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. లేటెస్ట్ గా సమంత ఖుషి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక సమంత తన నటనకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది సామ్.

Samantha Ruth Prabhu : స్టైలిష్ సమంత.. సోషల్ మీడియాలో అమ్మడి అదిరిపోయే లుక్స్
Samantha
Follow us on

సమంత .. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సామ్ డ్రస్సెన్స్ కు ఫిదా కానీ కుర్రకారు ఉండరు. ఈ అమ్మడి డ్రస్సెన్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపికే..

ఏం మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది సామ్. మొన్నీమధ్య సామ్ ఓ స్టైలిష్ డ్రస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వైట్ అండ్ వైట్ డ్రస్ లో అదరగొట్టింది.

అలాగే ఆమధ్య టర్కీ వెళ్లిన సమయంలోనూ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. అక్కడ బ్లాక్ కలర్ డ్రస్ లో మెరిసింది. స్టైలిష్ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని ఓ మిర్రర్ ఫోటోను షేర్ చేసింది సమంత.

అలాగే విదేశాల్లో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళింది సామ్.  టర్కీలో రిలీక్స్ అవుతూ  ఓ ఫోటో ను షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రస్ లో గడ్డి పై పడుకొని ఫోటోకి ఫోజిచ్చింది సామ్.

సమంత బాలీవుడ్ లో సెటాడియల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ సమంత అదిరిపోయే డ్రసింగ్ లో కనిపించి ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ డ్రస్ లో అప్సరసలా ఉంది సామ్.

అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లోకూడా సామ్ స్టైలిష్ డ్రస్ లో కనిపించింది. వైట్ అండ్ వైట్ కోట్ లో దర్శనమిచ్చింది సామ్. అలాగే ఆకట్టుకునే జ్యులారీతో కవ్వించింది సామ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.