సినిమా ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా అనుకోని సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. ‘మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి.. అప్పటి సీఎంచెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతోఉంది. ప్రతీ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలుకొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు వినతి. సున్నితమైన విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించొద్దు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది.
‘ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల.. సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను. ‘మా’ సభ్యులకు ఐక్యత అవసరం’ అని తన ప్రకటనలో పేర్కొన్నారు మంచు విష్ణు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని ఇది వరకే చెప్పుకొచ్చాడు మంచు వారబ్బాయి. మ హాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్. శరత్ కుమార్,మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుందన్, శివ బాలాజీ, కౌశల్, సురేఖా వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz
— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.