AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandini Reddy: ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు నష్టపోరు.. ఆసక్తికర విషయం చెప్పిన నందిని రెడ్డి

'మా ఇంటి బంగారం' సినిమాతో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ నందిని రెడ్డి. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ కు చేరువలో ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు.

Nandini Reddy: ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు నష్టపోరు.. ఆసక్తికర విషయం చెప్పిన నందిని రెడ్డి
Nandini Reddy
Basha Shek
|

Updated on: Jul 10, 2026 | 6:06 PM

Share

తీసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ నందిని రెడ్డి. అలా మొదలైంది సినిమాతో కెరీర్ ను ప్రారంభించారామె. ఆ తర్వాత జబర్దస్త్, కల్యాణ్ వైభోగమే, ఓ బేబీ, అన్నీ మంచిశకునములే.. రీసెంట్ గా మా ఇంటి బంగారం తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా సమంతతో ఆమె తెరకెక్కించిన రీసెంట్ మూవీ మా ఇంటి బంగాం మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత నెలలో విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సమయంలో సినిమా మేకింగ్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ‘ నేను ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ నాతో సినిమా చేసిన ఏ నిర్మాత కూడా నష్టపోలేదు. అందుకు ప్రధాన కారణం ఏ సినిమా అయినా నేను తక్కువ రోజుల్లో పూర్తి చేస్తాను. అది కూడా అనుకున్న బడ్జెట్‌లో కంప్లీట్ చేస్తాను.’

‘నేను దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించే ముందు ఒకరు నాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి , ఆయన సినిమాల మేకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఆయన చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తారని, అలాగే ముందుగా నిర్ణయించిన బడ్జెట్‌లోనే చిత్రాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావని చెప్పారు. నేను కూడా పూరి జగన్నాథ్ విధానాన్నే అనుసరిస్తాను. సినిమాకు అవసరమైన చోట నిర్మాతతో ఖర్చు పెట్టిస్తాను. కానీ అనవసర ఖర్చులకు మాత్రం ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వను. సినిమాలను వేగంగా, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే నా సినిమాల్లో కొన్ని ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రాలేదు’ అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

నందిని రెడ్డి రీసెంట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ దొరికాడ్రోయ్..
ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ దొరికాడ్రోయ్..
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం.. జాబ్‌లోంచి తీసేశారని..
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం.. జాబ్‌లోంచి తీసేశారని..
శ్రావణ శుక్ల దశమి.. శనివారం శని దేవుడిని ఇలా పూజిస్తే శుభఫలితాలు!
శ్రావణ శుక్ల దశమి.. శనివారం శని దేవుడిని ఇలా పూజిస్తే శుభఫలితాలు!
కేంద్రం నుంచి అద్బుత పథకం.. మీ ఆదాయం ఒకేసారి డబుల్
కేంద్రం నుంచి అద్బుత పథకం.. మీ ఆదాయం ఒకేసారి డబుల్
25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు
25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు
డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. కళ్లుచెదిరే జీతం
డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. కళ్లుచెదిరే జీతం
మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..