Salman Khan: సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణ చెబితే వదిలేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..

|

Oct 14, 2024 | 2:01 PM

ఇకపై తాను ఎవరినీ ప్రత్యేక్షంగా కలవనని సల్లూ భాయ్ నిర్ణయించుకున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ కు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఒక్కటే మార్గమని బిష్ణోయ్ వర్గం హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణ చెబితే వదిలేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..
అందుకే సల్మాన్‌ లేని బిగ్ బాస్‌ను బాలీవుడ్ ఆడియన్స్‌ ఊహించలేరు. ప్రతీ వారాంతంలో స్మాల్‌ స్క్రీన్‌ మీద సల్మాన్ చేసే సందడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
Follow us on

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో ముంబైలో అలర్ట్ అయ్యారు పోలీసులు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏కు బాబా సిద్ధిఖీ స్నేహితుడని.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని అంటున్నారు. బాబా సిద్ధిఖీ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడి మరణవార్త విని బిగ్ బాస్ రియాల్టీ షో షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు సల్మాన్ ఖాన్. ఇకపై తాను ఎవరినీ ప్రత్యేక్షంగా కలవనని సల్లూ భాయ్ నిర్ణయించుకున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ కు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఒక్కటే మార్గమని బిష్ణోయ్ వర్గం హెచ్చరించినట్లు తెలుస్తోంది.

1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు. ఈ కేసులో కింది కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి బెయిల్ వచ్చింది. బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింక దైవంతో సమానం. తాము పూజించే కృష్ణజింకను సల్మాన్ వేటాడి చంపాడని.. అతడిని ఎలాగైనా చంపేస్తామని ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించింది. ఇదివరకే సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ మేరకు బిష్ణోయ్ కమ్యూనిటీ అఖిల భారత అధ్యక్షుడు దేవేంద్ర బుధియా ఓ ప్రకటన చేశారు.

సల్మాన్ ఖాన్ తరపున సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణలు చెప్పడంతో అతడు ఈ విషయంపై స్పందించాడు. “సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే బిష్ణోయ్ సంఘం దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. సోమి అలీ ఎలాంటి తప్పు చేయలేదు. అందువలన ఆమె క్షమాపణ అంగీకరించలేము. సల్మాన్ గుడికి రావాలి. ఆ తర్వాత అతడు స్వయంగా క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాత అతడికి విధించే శిక్ష గురించి ఆలోచించవచ్చు” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.