Tollywood: ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్..

నేను ఇప్పటికే చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమి లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండను. నిన్ను ఎంతో ప్రేమించి చివరకు నన్నే నేను కోల్పోయాను. నా మనసు ముక్కలు చేశావు. నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను.. కానీ నన్ను మానసికంగా చంపేశావు నువ్వు. నాకు భవిష్యత్తు కనిపించడం లేదు.

Tollywood: ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్..
Actress
Follow us

|

Updated on: Apr 30, 2024 | 9:33 AM

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇందులో నటీనటులుగా ఎదగాలని.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెడతారు చాలా మంది. అందులో కొందరు తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఇండస్ట్రీలోని కొందరు ప్రేమ, పెళ్లితో కెరీర్ అస్తవ్యస్తమవుతుంది. జియా ఖాన్.. ఈపేరు చెబితే బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ 25 ఏళ్ల వయసులోనే ప్రేమలో మోసపోయి తనువు చాలింది. 2013న జూన్ 3న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. జియా ఖాన్ మరణంపై ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఆమె ప్రియుడు నటుడు ఆదిత్య పంచోలీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు జియా ఖాన్ రాసిన చివరి లేఖ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

“నేను ఇప్పటికే చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమి లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండను. నిన్ను ఎంతో ప్రేమించి చివరకు నన్నే నేను కోల్పోయాను. నా మనసు ముక్కలు చేశావు. నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను.. కానీ నన్ను మానసికంగా చంపేశావు నువ్వు. నాకు భవిష్యత్తు కనిపించడం లేదు. నీపై అనంతమైన ప్రేమను చూపించాను.. కానీ ప్రేమించడానికి బదులుగా మోసం చేశావు. అబద్దాలు, నమ్మకద్రోహం చేశావు. నిత్యం చిత్రవధ చేశావు. తిండి, నిద్రలేకుండా చేశావు. ఆలోచనలు రావడం లేదు. నేను ఇప్పుడు అన్నింటికీ దూరమయ్యాను. కెరీర్ లేకుండా పోయింది.

నాకు అర్థం కావడం లేదు వీధి ఎందుకు మనిద్దరిని కలిపింది అని. శారీరకంగా నాపై దాడి చేశావు. హింసించావు.. ఇదంతా నాకే ఎందుకు జరగాలి ? నీ నుంచి ప్రేమ కనిపించలేదు. ఇంకా నన్ను నువ్వు శారీరకంగా, మానసికంగా చంపేస్తావేమో అని భయమేస్తుంది. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించాను. ఇంత బాధ పెట్టినా ఇప్పటికీ నువ్వే కావాలనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పటికీ మారవు అనిపిస్తుంది. అందుకే నా కలలకు.. నా జీవితానికి ఇక గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నాకు నువ్వు మోసం చేస్తున్నావని మేసేజ్ వచ్చింది. కానీ నీపై నమ్మకంతో ఆ మేసేజ్ పట్టించుకోలేదు. కానీ చివరకు అదే నిజమైంది. నీతో జీవితం ఊహించుకున్నాను. కానీ అబార్షన్ నన్ను ఎంతగానో కుంగదీసింది. జీవితాన్ని నాశనం చేశావు. నీకోసం ఎదురుచూసి ఎంతగానో ఏడ్చాను. ఇప్పుడు నేను ఒంటరి. అందుకే శాశ్వతంగా నిద్రపోవాలనుకుంటున్నాను” అంటూ జియా రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Jiah Khan

Jiah Khan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పిల్లలకు మన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేయాలనుకుంటున్నారా..
పిల్లలకు మన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేయాలనుకుంటున్నారా..
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు