Prithviraj Sukumaran: నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

|

Apr 07, 2025 | 11:13 AM

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కొన్ని రోజులుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీలోని పలు సన్నివేశాలపై తమిళనాడు రైతులు సీరియస్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు పృథ్వీరాజ్ సుకుమార్ కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Prithviraj Sukumaran: నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..
Prithviraj Sukumaran, Malli
Follow us on

ఎల్ 2 ఎంపురాన్ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆదాయపు పన్ను శాఖ నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. 2022లో విడుదలైన మూడు సినిమాల నుండి పృథ్వీరాజ్ సంపాదించిన ఆదాయం గురించి వివరాలను స్పష్టం చేయాలని నోటీసులో కోరారు. ఈ సినిమాలకు ఆయన నిర్మాతగా, నటుడిగా పనిచేశారు. మరోవైపు ఎంపురాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి రాజకీయ వివాదాలను రేకెత్తిస్తోంది. 2002 గుజరాత్ అల్లర్ల మసయంలో జరిగిన దృశ్యాలు ఎక్కువగా మితవాద ప్రేక్షకులలో కలకలం రేపాయి. అయితే ఈ ఘటనపై పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు.

మాతృభూమి న్యూస్‌తో మాట్లాడుతూ.. “నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేము ఎలాంటి దర్యాప్తుకూ భయపడము” అని అన్నారు. “నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేం దర్యాప్తునకు సిద్ధంగానే ఉన్నాం. భయపడడం లేదు. ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తోన్న వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ముఖ్యంగా మమ్ముట్టి మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ వార్తలను చూసి అన్నీ సర్దుకుంటాయి అని మెసేజ్ చేశారు. అది చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. పృథ్వీరాజ్ కంటే మమ్ముట్టి ఎంతో ప్రముఖుడు అయినప్పటికీ మా కోసం ఆయన సమయం తీసుకుని మెసేజ్ చేయడం ఆయన గొప్పతనం” అంటూ చెప్పుకొచ్చారు.

పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జన గణ మన, గోల్డ్, కడవు చిత్రాలకు సంబంధించిన సంపాదన వివరాలు సమర్పించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఈ చిత్రాలు 2022లో విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టులలో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ చిత్రాలకు నటుడిగా పారితోషికం మాత్రమే కాకుండా అసోసియేట్ నిర్మాతగా మాత్రమే ఆదాయం తీసుకున్నారట. 2022లో, పృథ్వీరాజ్ సుకుమారన్ దాఖలు చేసిన దాఖలులో వ్యత్యాసాలు ఉన్నాయని అనుమానిస్తూ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, నిర్మాణ సంస్థపై దాడి చేశారు. మరోవైపు ఎంపురాన్ సినిమాపై వివాదాలు వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?