AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: కుమారి ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లతో కలిసి ఏం చేస్తుందో తెలుసా? వీడియో

సోషల్ మీడియా సెన్సేషన్ కుమారీ ఆంటీ ఆ మధ్యన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి ప్రముఖ టీవీ షోల్లో సందడి చేసింది. బిగ్ బాస్ షోలోనూ పాల్గొంటారని వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు కుమారీ ఆంటీ ఏకంగా సినిమా సెలబ్రిటీగా మారిపోయింది.

Kumari Aunty: కుమారి ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లతో కలిసి ఏం చేస్తుందో తెలుసా? వీడియో
Kumari Aunty
Basha Shek
|

Updated on: Jun 30, 2025 | 6:30 PM

Share

కుమారి ఆంటీ.. ఆ మధ్యన సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోయింది. ఎక్కడో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని ఉండే కుమారి ఆంటీ ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. ‘టూ లివర్స్‌ ఎక్స్‌ట్రా మీది మొత్తం థౌజండ్‌ అయ్యింది’ అని ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయి. చివరకు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఆమె ఫుడ్ స్టాల్‌ను అధికారులు తీసేస్తే సీఎం కూడా స్పందించాల్సి వచ్చింది. ఆఖరికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఫేమస్ టీవీ షోలు కూడా కుమారి ఆంటీ క్రేజ్ ను వాడుకున్నాయి. అలాగే బిగ్ బాస్ షోలోనూ పాల్గొంటారని వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే ఈ మధ్యన కాస్త సైలెంట్ అయిన కుమారి ఆంటీ మళ్లీ వార్తల్లో నిలిచింది. సినిమా టీం కూడా ఆమె క్రేజ్‌ను వాడుకున్నారు. ఇందులో భాగంగా నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న షో టైం మూవీ టీం కుమారీ ఆంటీని తీసుకు వచ్చి ప్రమోషనల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు.

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం షో టైమ్. మధన్ కుమార్ ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా కుమారి ఆంటీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ‘కుమారి ఆంటీని సెలబ్రిటీ చేశారు’, ‘అంతా సోషల్ మీడియా మహత్యం’ అంటూ నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో ఆమె ఫుడ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నవీన్ చంద్ర షో టైమ్ మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ.. వీడియో..

ఇక షో టైమ్ సినిమా విషయానికి వస్తే.. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్‌పై కిషోర్ గరికిపాటి షో టైమ్ సినిమాను నిర్మించారు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మధ్యన నవీన్ చంద్ర నటిస్తోన్న సినిమాలు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కించుకుంటోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..