Jabardasth: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..!

జబర్దస్త్ స్టార్ కొమరక్క తన రూ.200 కోట్ల ఆస్తి వెనుక ఉన్న నిజాలను వెల్లడించారు. తండ్రి భూమి అమ్మిన తర్వాత, స్వంతంగా భూమి కొనాలనే తపనతో అహర్నిశలు శ్రమించి, ప్రతి రూపాయిని తెలివిగా భూమిలో పెట్టుబడిగా పెట్టారు. హోటల్‌లో పనిచేసి, చిన్నప్పటి నుండి కష్టపడి, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఈ స్థాయికి చేరుకున్న తన ప్రయాణాన్ని వివరించారు.

Jabardasth: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..!
Komarakka Jabardasth

Updated on: Mar 30, 2026 | 8:12 PM

జబర్దస్త్ నటుడు కొమరక్క తన ఆస్తుల విషయంలో వస్తున్న వార్తలపై స్పందించారు. తనకు దాదాపు 20 ఎకరాల భూమి ఉందని, దాని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతున్న వార్తలపై వివరణ ఇచ్చారు. ఈ ఆస్తి తాను కేవలం జబర్దస్త్ ద్వారా సంపాదించినది కాదని, ఇందులో పూర్వీకుల నుంచి వచ్చినది కొంత ఉందని, మిగిలినది తన కష్టార్జితం, సరైన సమయంలో చేసిన పెట్టుబడుల ఫలితమని కొమరక్క స్పష్టం చేశారు. కొమరక్క తన ప్రయాణాన్ని వివరిస్తూ, తన తండ్రి గతంలో తమకున్న 20 ఎకరాల భూమిలో.. దాదాపు 15 ఎకరాలు అమ్మడంతో… 5 ఎకరాలే మిగిలిందని చెప్పారు.  తనకు అప్పటి నుంచి భూమి కొనాలనే పిచ్చి ఉండేదని వెల్లడించారు. “నేను కొనాలి, కొనాలి, కొనాలి” అనే తపనతో ప్రతి రోజు కష్టపడ్డానని తెలిపారు. తాను, తన భార్య కలిసి ప్రతి రూపాయిని జాగ్రత్తగా కూడబెట్టారని, తనకు వేరే ఎలాంటి దురలవాట్లు లేవని పేర్కొన్నారు.

అప్పట్లో భూముల ధరలు తక్కువగా ఉన్నప్పుడు, కష్టపడి కూడబెట్టిన డబ్బునంతా భూమిపైనే పెట్టుబడిగా పెట్టానని కొమరక్క తెలిపారు. “దేవుడి దయవల్ల ప్రతి రూపాయి ల్యాండ్‌మీద పెట్టినా కాబట్టి అవి అంత అట్లా అయిపోయింది” అని, ఈ విజయం వెనుక తన ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఆ ఆస్తిని ఏమీ చేయలేదని, అది కాలక్రమేణా పెరిగిందని వినయంగా చెప్పారు. “మరి రిచ్ పర్సనే కదా” అనే ప్రశ్నకు, “భూమి ఉంది.. దాన్ని అమ్ముకోం కదా” అని సమాధానమిచ్చారు. జబర్దస్త్‌లోకి రాకముందు కొమరక్క జీవితం వేరుగా ఉండేది. ఆయన పెద్దగా చదువుకోలేదని, పదవ తరగతి పూర్తయిన తర్వాత హోటల్‌లో పనిచేసినట్లు వెల్లడించారు. హోటల్ పని నుంచి జబర్దస్త్ వంటి వినోద కార్యక్రమాల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించగా, తన ప్రయాణం ఎలా మారిందో వివరించడం మొదలుపెట్టారు. అప్పట్లో “ఉతప్పం” అనే ఒక షోలో కూడా పనిచేసినట్లు తెలిపారు. కొమరక్క జీవితం, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, సరైన పెట్టుబడులు, నిరాడంబరమైన జీవనశైలితో ఎంతటి సంపదను అయినా కూడబెట్టవచ్చని నిరూపిస్తుంది.

Komaram

అయితే కొమరక్క అలియాస్ కొమరం మాత్రమే కాదు. జబర్దస్త్ నటీనటులు చాలామంది ఇంకా వెల్ సెటిల్డ్ అయ్యారు. చాలామంది బంగ్లాలు, లగ్జరీ కార్లు, ల్యాండ్లు కొన్నారు. వారిలో కొమరం కాస్త ఓపెన్‌గా చెప్పాడు అంతే.

Also Read: పిల్లలిద్దరూ లండన్‌లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు 

Follow Us