Tollywood: 23 సార్లు లిప్ లాక్ సీన్.. సినిమా కోసం జెండర్ రిస్క్.. సక్సెస్ రుచి చూడని హీరోయిన్..

సినీరంగంలో హీరోయిన్‏గా సెటిల్ కావడానికి చాలా మంది ఎన్నో రిస్కులు చేస్తుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. తమ పాత్రకు ప్రాణం పెడుతుంటారు. యాక్టింగ్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఒక సీన్ లో 23 లిప్ లాక్ సీన్స్ చేసి.. సినిమా కోసం జెండర్ మార్చుకుంది. కానీ ఇప్పటికీ సక్సెస్ కలిసిరాలేదు.

Tollywood: 23 సార్లు లిప్ లాక్ సీన్.. సినిమా కోసం జెండర్ రిస్క్.. సక్సెస్ రుచి చూడని హీరోయిన్..
Vaani Kapoor

Updated on: Aug 24, 2025 | 9:06 AM

సినిమా ప్రపంచంలో నటీమణులుగా కొనసాగడం అంత సులభం కాదు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిసారి పాత్ర కోసం ప్రమాదాకరమైన పనులు చేస్తుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఒక సినిమాలో 23 సార్లు లిప్ లాక్ సీన్ చేసింది. అంతేకాదు.. తన పాత్ర కోసం జెండర్ మార్చుకుంది. కానీ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ వాణి కపూర్. తన సినీప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. 1988 ఆగస్ట్ 23న ఢిల్లీలో జన్మించారు. పర్యాటక రంగంలో పట్టభద్రురాలైన ఆమె.. జైపూర్‌లోని ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ముంబైకి వెళ్లి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి

2013లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రాతో కలిసి శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2016లో, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘బేఫికర్’ చిత్రంలో కనిపించింది. ఇందులో 23 సార్లు లిప్ లాక్ సీన్స్ చేసింది. ఆ తర్వాత ‘చండీగఢ్ కరే ఆషికి’లో వాణి ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రను పోషించింది. ఈ రెండు సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వాణి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ సరసన ఖేల్ ఖేల్ మే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో సోనాక్షి సిన్హా, తయాని భట్టాచార్య సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే గ్లామరస్ పాత్రలతో ఫేమస్ అయిన వాణికి.. ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..