AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఒక్క ఘటనతో తాను హీరోయిన్ అనే విషయమే మర్చిపోయింది.. జీవితం తలకిందులైంది.

ఆమె ఒకప్పుడు తోపు హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్ల కలల రాణి. ఆమె అందానికి, నటనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఊహించని ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంతేకాకుండా తాను నటిననే విషయమే మర్చిపోయింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.

అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఒక్క ఘటనతో తాను హీరోయిన్ అనే విషయమే మర్చిపోయింది.. జీవితం తలకిందులైంది.
Anu Aggarwal
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2026 | 8:38 PM

Share

ఒకే సినిమాతో గొప్ప పేరు సంపాదించుకున్న ఒక నటి కొద్ది రోజుల్లోనే ఆమె జీవితం తలకిందులు అయ్యింది. ఒకే ఒక్క ప్రమాదం ఆమె మొత్తం సినీ కెరీర్‌ను ముగించింది. తన జీవితంలో తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కొన్న ఒక నటి గురించి మీకు తెలుసా. ఆమె పేరు అను అగర్వాల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ‘తిరుడ తిరుడ’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1969లో ఢిల్లీలో జన్మించిన అను అగర్వాల్‌కు తన కళాశాల రోజుల్లో మోడలింగ్‌పై ఆసక్తితో వీజేగా మారారు. 1990లో ‘ఆషిఖీ’ అనే హిందీ చిత్రంతో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో అను అగర్వాల్ యాక్టింగ్, గ్లామరస్ లుక్స్ చూసి అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారు. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో వర్గీస్ అనే పాత్రలో నటించిన ఆమె.. ప్రేక్షకుల హృదయాల్లోనూ ఆ పాత్రతోనే స్థానం సొంతం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ఆషిఖీ సినిమాతో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ఆ తర్వాత అను అగర్వాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ కాలం ఒక్క రోజులోనే అను అగర్వాల్ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసింది. 1999లో అను అగర్వాల్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనతో ఆమె దాదాపు 29 రోజుల పాటు కోమాలో ఉండిపోయారు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అను పూర్తిగా తన జీవితాన్ని మర్చిపోయింది. తాను ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయింది. అలాగే ఆ ప్రమాదంలో ఆమె ముఖం పూర్తిగా మారిపోయి దారుణంగా కనిపించింది. ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆమె శరీరంలో సగం భాగం పక్షవాతానికి గురైంది.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ఆ తర్వాత చికిత్స తీసుకుని నెమ్మదిగా కోలుకుంది. ప్రతి విషయాన్ని తెలుసుకుని, నేర్చుకునే చిన్న పిల్లలా మారిపోయింది. చాలా కాలం పాటు ఆమె బయటకు రాలేదు. కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత తన మానసిక స్థితిని మెరుగుపర్చుకోవడానికి ధ్యానం, యోగ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె సామాజిక సేవలో ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us
అన్న వండే ముందు బియ్యాన్ని కడగాలా? వద్దా..?.. కొత్త స్టడీలో..
అన్న వండే ముందు బియ్యాన్ని కడగాలా? వద్దా..?.. కొత్త స్టడీలో..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా..
పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా..
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
మహదేవుడి దర్శనం మళ్లీ ప్రారంభం.. భీమాశంకర్ ఆలయం తెరుచుకుంది
మహదేవుడి దర్శనం మళ్లీ ప్రారంభం.. భీమాశంకర్ ఆలయం తెరుచుకుంది
ఈ హీరోయిన్ కష్టం ఎవరికీ రాకూడదు.. ఒక్క ఘటనతో జీవితం తలకిందులైంది.
ఈ హీరోయిన్ కష్టం ఎవరికీ రాకూడదు.. ఒక్క ఘటనతో జీవితం తలకిందులైంది.
అమెరికా నుంచి భారత్‌ కు అందుకే వచ్చా!
అమెరికా నుంచి భారత్‌ కు అందుకే వచ్చా!
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..