టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు. ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు కిరణ్. రాజావారు రాణి గారు, ఎస్ ఆర్ కల్యాణమండపం లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా చాందిని చౌదరి నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్ కి రప్పించడం మరో ఛాలెంజ్ గా మారిన పరిస్థితి నెలకొంది అన్నారు. థియేటర్స్ ని కాపాడాల్సిన భాద్యత మనందరిపై వుంది. చిన్నవాడినైనా అందరికీ వేడుకుంటున్నాను. టీవీలో ఓటీటీలో సినిమా చూడొచ్చు కానీ థియేటర్ లో సినిమా చూడటంలో ఓ ఆనందం వుంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వుంటే చాలు. కానీ కళ్యాణ మండపం బుక్ చేసి అందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేసుకుంటాం. అందులో ఒక ఆనందం ఉంటుంది. సినిమాని థియేటర్లో చూడటం కూడా లాంటి ఆనందమే వుంది. నా మొదటి రెండు సినిమాలకి థియేటర్స్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమాకి మాత్రం హాయిగా ప్రమోషన్స్ చేసుకొని ఊరూరా తిరిగాను. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు గారికి రుణపడి వుంటాను. వారితో మాట్లాడితే చాలు ధైర్యంగా వుంటుంది, నాకు ఇంత ధైర్యం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు అన్నారు.
సమ్మతమే చిత్రం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఒక్క ఇబ్బందికరమైన సీన్ కూడా వుండదు. ఫ్యామిలీ కలసి అందరూ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ నుండి బయటికి వెళ్ళినపుడు మేము ఒక పాయింట్ చెప్పాం. దాని గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. ఈ చిత్రానికి పని చేసిన డీవోపీ సతీష్, ఎడిటర్ విప్లవ్ , సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. ప్రతి ఒక్కరికి థాంక్స్. చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ అమ్మగారికి కృతజ్ఞతలు. చాందిని నేను షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చాం. ఇద్దరం కలసి ఈ చిత్రం చేయడం ఆనందంగా వుంది. ఎక్కువగా అలోచించవద్దు. కాన్ఫిడెంట్ గా టికెట్ బుక్ చేసుకోండి. సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి