Vikrant Rona: ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా విక్రాంత్ రోణ‌.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

|

Jun 23, 2022 | 6:39 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడనాట స్టార్ హీరోగా రాణిస్తునే తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించాడు సుధీప్. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాడు ఈ స్టార్ హీరో.

Vikrant Rona: ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా విక్రాంత్ రోణ‌.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
Vikrant Rona
Follow us on

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడనాట స్టార్ హీరోగా రాణిస్తునే తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించాడు సుదీప్. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాడు ఈ స్టార్ హీరో. సుదీప్ సినిమాలు ఇప్పుడు తెలుగులోనూ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరో ఓ భారీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రాంత్ రోణ‌`(Vikrant Rona) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఊరే ఒక మర్మమైన ఊరు..ఆ ఊరు ప్రజలు ఎదో ఒక భయంకరమైన కథను దాచాలనుకుంటున్నారు.. అంటూ వచ్చే వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. భయం నిండిన ఆ ఊరిలో భయం అంటే ఏమిటో తెలియలియని ఒకడొచ్చాడు అనే హీరో ఎలివేషన్ డైలాగ్ ఆకట్టుకుంది. ఫారెస్ట్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. త్రీడీ ఫార్మాట్‌లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను తెలుగు,  కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 6ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ హిందీ వర్షన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సమర్పణలో నార్త్ ఆడియన్స్ కు అందించనున్నారు.ఇక ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో నీతా అశోక్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి