AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: సీనియర్ హీరోయిన్ సుమలత కొడుకు పెళ్లి కేజీఎఫ్ స్టార్ డాన్స్..  యశ్ అదరగొట్టేశాడు.. వీడియో వైరల్.. 

కర్ణాటకలోని ఒక ప్యాలస్ లో జరిగిన పెళ్లికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ఎంపీ రఘురామరాజు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కేజీఎఫ్ స్టార్ యశ్, మంచు మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Yash: సీనియర్ హీరోయిన్ సుమలత కొడుకు పెళ్లి కేజీఎఫ్ స్టార్ డాన్స్..  యశ్ అదరగొట్టేశాడు.. వీడియో వైరల్.. 
Yash
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2023 | 5:39 PM

Share

సీనియర్ హీరోయిన్ సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ఆ తర్వాత సహయనటిగా మెప్పించారు. ప్రస్తుతం సీని పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆమె.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కర్ణాటక లోక్ సభ ఎంపీగా ఉన్న సుమలత.. ఇటీవల తన కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం ఘనంగా చేశారు. కర్ణాటకలోని ఒక ప్యాలస్ లో జరిగిన పెళ్లికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ఎంపీ రఘురామరాజు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కేజీఎఫ్ స్టార్ యశ్, మంచు మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వేడుకలో యశ్, మరో స్టార్ హీరో దర్శన్ పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజ్ పీ డాన్స్ చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. అలాగే యశ్ తన సతీమణి రాధిక.. నటి సుమలతో కలిసి స్టెప్పులేసి వావ్ అనిపించారు. ఇక ఇదే పార్టీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, జాకీ ష్రాఫ్ తదితరులు హజరయ్యారు.

ఇవి కూడా చదవండి

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ తర్వాత ఇప్పటివరకు యశ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ చిత్రంలో యశ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..