
స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాంతో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కాగా తాజాగా విడుదలైన కరుప్పు సినిమా సూర్యకు మంచి హిట్ ఇచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరుప్పు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఈ సినిమా ఇప్పుడు వందకోట్ల మార్క్ ను కూడా దాటేసింది. దాంతో సూర్య ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. సూర్యకు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే కరుప్పు సినిమాను తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే సూర్య ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.. సూర్య హీరోయిన్ జోతికను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఇప్పుడు సూర్య కూతురు దియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సూర్య ఫ్యామిలీ ముంబైలో తళుక్కుమన్నారు. దాంతో వీరిని ఫోటోలు తీసేందుకు మీడియా ఎగబడింది. కాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య , జోతిక కూతురిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అచ్చం అమ్మలానే చాలా అందంగా ఉంది ఆ చిన్నది.
చదువులో దియా చాలా చురుకైనది. ముఖ్యంగా ఆమె తన 10వ తరగతి పరీక్షల్లో 98.4 శాతం మార్కులతో టాప్ స్కోర్ సాధించి అప్పట్లో వార్తల్లో నిలిచింది. కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, ఇతర ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లోనూ ఆమె ముందుంటుంది. ఆమెకు క్రికెట్, ఫుట్‌బాల్ ఆడటం అంటే ఇష్టం. అంతేకాకుండా దియా మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. ప్రస్తుతం చదువు పై ఫోకస్ చేసిన ఈ చిన్నది సూర్య, జోతికలానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక దియా లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి చక్కర్లు కొట్టడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దియా తన తల్లి జోతిక కన్నా అందంగా ఉంది అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్.