AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఇది అమ్మాయిల సాంగ్.. కానీ అబ్బాయిలే ఎక్కువగా వింటారు.. 31 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎన్నో పాటలు దూసుకుపోతున్నాయి. కానీ మీకు తెలుసా.. దాదాపు 31 సంవత్సరాలుగా ఒక పాట సంచలనం సృష్టిస్తుంది. నిజానికి ఆ పాట అమ్మాయిల ఫేవరేట్. కానీ ఎక్కువగా అబ్బాయిలే పాడుతుంటారు. ఇంతకీ ఆ పాట ఏంటంటే. అత్యంత ప్రజాదరణ పొందిన 6 నిమిషాల పాట, ఇది ఇప్పటికీ లక్షలాది మంది ప్రజల ప్లేలిస్ట్‌లలో కనిపిస్తుంది. ఈ సాంగ్ వినగానే మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

Trending Song: ఇది అమ్మాయిల సాంగ్.. కానీ అబ్బాయిలే ఎక్కువగా వింటారు.. 31 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
Kannanule Song
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2026 | 9:18 PM

Share

1990వ దశకంలోని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పాటలకు ఇప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ కాలంలోని పాటల సరళమైన, మధురమైన , హృదయాన్ని హత్తుకునే లిరిక్స్ ఇప్పటికీ శ్రోతల శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి ఒక పాటే 1995లో విడుదలైన ‘బాంబే’ చిత్రంలోని కన్నానులే.. ఈ పాట తొలిచూపు ప్రేమ అనే అందమైన అనుభవాన్ని, మాటలు లేకుండా భావాలను వ్యక్తపరచడాన్ని వర్ణిస్తుంది. సుమారు 6 నిమిషాల నిడివి గల ఈ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలలో నిలిచిపోయింది. నిజానికి ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. అప్పట్లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 31 సంవత్సరాల క్రితం విడుదలైన ఈపాట సంచలన విజయం సాధించింది. అంతేకాదు.. ఆ సమయంలో లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఈ పాట క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ఈ పాట వీడియోలను యూట్యూబ్ , సోషల్ మీడియాలో లక్షలాది సార్లు వ్యూ్స్ వచ్చాయో చెప్పక్కర్లేదు. అలాగే ఎక్కడ విన్నా ఈ పాట మారుమోగుతుంది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఈ పాటకు క్రేజ్ కొనసాగుతూనే ఉంది, ఇది ప్రేక్షకులకు ప్రేమ, భావోద్వేగం , మధురమైన సంగీతంతో కూడిన అందమైన అనుభూతిని అందిస్తూనే ఉంది. బాంబే సినిమా గురించి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో 1995లో వచ్చిన బాంబే (Bombay) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక క్లాసిక్. అప్పట్లో సమాజంలో ఉన్న సున్నితమైన మతపరమైన అంశాలను, ఒక అందమైన ప్రేమకథతో ముడిపెట్టి ఆయన తెరకెక్కించిన విధానం అద్భుతం. 1992-1993 కాలంలో ముంబైలో జరిగిన మత ఘర్షణల (Bombay riots) నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

కథ విషయానికి వస్తే..

ఒక పల్లెటూరిలో ఉండే హిందూ యువకుడు శేఖర్ (అరవింద్ స్వామి), ముస్లిం యువతి శైలా బానో (మనీషా కొయిరాలా) ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో, ఇద్దరూ ముంబై (అప్పటి బాంబే) నగరానికి పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు (కబీర్ నారాయణ, కమల్ బషీర్) పుడతారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, నగరంలో మత ఘర్షణలు చెలరేగుతాయి. ఆ దారుణమైన పరిస్థితుల్లో ఈ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది, చివరికి మానవత్వం ఎలా గెలిచింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ సంగీతం. “ఉరికే చిలకా”, “కురిసే వెన్నెలా”, “కలగా జరిగిపోయే” వంటి పాటలు ఎవర్గ్రీన్ హిట్స్. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే “బాంబే థీమ్” (Bombay Theme Background Music) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఎన్నో అంతర్జాతీయ ఆల్బమ్స్‌లో ఈ ట్యూన్‌ని వాడుతుంటారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

కన్నానులే సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..