War 2 Update: వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్.. తారక్ ఎలా ఉన్నారంటే..

. తారక్, హృతిక్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్లు మసమాచారం. ఇందులో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఇద్దరూ స్టార్స్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్స్ నుంచి తారక్, హృతిక్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

War 2 Update: వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్.. తారక్ ఎలా ఉన్నారంటే..
War 2
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:54 PM

దేవర సినిమా షూటింగ్‏కు ఎన్టీఆర్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు తారక్. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లారు గ్లోబల్ స్టార్. మొదటిసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పది రోజుల షూటింగ్ లో మాత్రమే తారక్ కనిపించనున్నారు. తారక్, హృతిక్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్లు మసమాచారం. ఇందులో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఇద్దరూ స్టార్స్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్స్ నుంచి తారక్, హృతిక్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఇద్దరూ కూడా లేటేస్ట్ స్టైలీష్ లుక్స్‏లో కనిపిస్తున్నారు. అందులో తారక్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో ఉండగా.. హృతిక్ స్కై బ్లూ షర్ట్, బ్లాక్ కోట్ తో కనిపిస్తున్నారు. ఇద్దరూ స్టైలీష్ రా ఏజెంట్స్ లుక్స్ లో కనిపిస్తుండడంతో వీరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

దీంతో ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తారక్, హృతిక్ మధ్య ఓసూపర్ డ్యాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం స్పెషల్ గా సాంగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ డ్యాన్సర్స్ గా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరి మధ్య సాంగ్ ఉండడంతో ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?