
క్రికెట్, సినిమా.. ఈ రెండు రంగాలకు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ రెండు రంగాలకు చెందిన ఇద్దరు స్టార్స్ ఒకే వేదికపై సందడి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాన్ ఈవెంట్‌లో కలుసుకున్నారు. ఎప్పుడూ మైదానంలో తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లను భయపెట్టే కమిన్స్.. ఇక్కడ మాత్రం తన సీరియస్‌నెస్‌ను పక్కనపెట్టి జాన్వీతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేశాడు. హైదరాబాద్‌లోని DLF Mallవేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు స్టేజ్‌పై ఏర్పాటు చేసిన చిన్న క్రికెట్ సెటప్‌లో ‘పెద్ది’ మూవీ స్టార్ జాన్వీ కపూర్ బ్యాట్ పట్టుకోగా, కమిన్స్ బౌలింగ్ చేశాడు.
ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ సరదాగా వేసిన బంతిని జాన్వీ కాస్త ముందుకు వచ్చి బలంగా షాట్ ఆడింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ బంతి నేరుగా వెళ్లి అక్కడే ఉన్న ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో స్టేజ్ కింద ఓ అభిమాని తన మొబైల్‌లో ఈ ఫన్నీ దృశ్యాలను రికార్డ్ చేస్తున్నాడు. జాన్వీ కొట్టిన బంతి నేరుగా వెళ్లి ఆ ఫ్యాన్ ఫోన్‌కి తగలడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఈ అనుకోని సంఘటనతో స్టేజ్ మీద ఉన్న జాన్వీ కూడా కంగుతింది. ఆ తర్వాత క్షణాల్లోనే అక్కడి వాతావరణం అంతా నవ్వులు, కేకలతో నిండిపోయింది. ఈ యాక్సిడెంటల్ షాట్, ఆ వెంటనే జాన్వీ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
ఈ క్యూట్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. బంతి తగిలిన అభిమానికి క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. “నేను కొట్టిన బంతి ఎవరి కంటికైతే తగిలిందో వాళ్ళకి సారీ.. క్రికెట్ ఆడేటప్పుడు నా బ్యాలెన్స్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు, కానీ ఎప్పటికీ నేను #newbalance బేబీనే” అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా కోసం సుమారు 150 రోజుల పాటు కఠినమైన క్రికెట్ శిక్షణ తీసుకుంది జాన్వీ కపూర్. అందుకే ఈమెకు క్రికెట్‌లో మంచి టాలెంట్ ఉ:ది. కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో ప్రొఫెషనల్ క్రికెటర్‌లా బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలు నేర్చుకుంది ఈ బ్యూటీ. ఈ ప్రాక్టీస్ సమయంలో జాన్వీకీ చాలా దెబ్బలు కూడా తగిలాయి. ఆ ప్రాక్టీస్ ఇప్పుడిలా పనికొచ్చింది.
కమిన్స్, జాన్వీ కలిసిన ఈ అరుదైన క్రికెట్-సినిమా క్రాస్‌ఓవర్ మూమెంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సినిమా వాళ్లను చూడటానికి వచ్చిన అభిమానులకు స్టార్ క్రికెటర్ కూడా తోడవడంతో ఈవెంట్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. జాన్వీ ఆడిన పవర్‌ఫుల్ షాట్‌పై, పాపం వీడియో తీసుకుంటూ బంతి బారిన పడ్డ ఆ అభిమానిపై నెటిజన్లు రకరకాల మీమ్స్, జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనా.. రీసెంట్ టైమ్స్‌లో జరిగిన అత్యంత ఫన్నీ అండ్ ఎంటర్‌టైనింగ్ సెలబ్రిటీ ఈవెంట్‌గా ఇది నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ది సినిమాలో కూడా క్రికెట్ నేపథ్యం ఉంది. మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే SRH Vs RCB మ్యాచ్‌లో పెద్ది సినిమా ప్రమోషనల్ యాక్టివిటీ కూడా ఉంది.
Pat Cummins bowling to Janhvi Kapoor during an event 😂
He would’ve never imagined that after dominating batters for years, one day he’d be bowling to a Bollywood actress at an event 😭 pic.twitter.com/NTiMWGqnYH
— Rohan💫 (@rohann__45) May 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.