
హీరోయిన్ సంతోషి శ్రీకర్ గురించి తెలిసిందే. జై సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. తర్వాత ఆమె భర్త శివ శ్రీకర్ ప్రసాద్ ఇటీవల తమ మొదటి ఇంటర్వ్యూలో వారి ప్రేమ కథ, వ్యక్తిగత ప్రయాణం, వృత్తిపరమైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేక సంభాషణలో వారిద్దరూ తమ బంధం, సంతోషి కెరీర్ విజయం వెనుక ఉన్న రహస్యాలను వెల్లడించారు. సంతోషి గతంలో అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారని తెలిపారు. తన మొదటి క్రష్ గురించి అడిగినప్పుడు, శివ శ్రీకర్ ప్రసాద్ తన మొదటి క్రష్ సంతోషి అని చెప్పారు. అయితే, సంతోషి మాత్రం చార్మీ తన మొదటి క్రష్ అని అన్నారు. శివ శ్రీకర్ ప్రసాద్ వారి ప్రేమ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. జై సినిమా షూటింగ్ సమయంలోనే తాను సంతోషిని ప్రేమించానని, షార్ట్ ఫిలిం కోసం అప్రోచ్ అవ్వగా, ఆమె తల్లి ఆమెను అంగీకరించలేదని చెప్పారు. అప్పట్లో ఆమె తల్లి, తన కూతురు హీరోయిన్ అవుతుంది కాబట్టి షార్ట్ ఫిలిం చేయదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన వల్ల వారి వివాహం 15 సంవత్సరాలు ఆలస్యమైందని, 21 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాల్సింది, ఇప్పుడు తనకు 42 ఏళ్లు అని, ఈ 10-15 సంవత్సరాల ఆలస్యం పట్ల తాను నిరాశగా ఉన్నానని అన్నారు.
సంతోషి తన వృత్తి జీవితం గురించి మాట్లాడుతూ, తాను చెన్నైలో పుట్టి పెరిగానని, హైదరాబాద్‌లో సుమారు మూడు, నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నానని చెప్పారు. ఆ సమయంలోనే రామోజీ ఫిలిం సిటీలో పనిచేశానని, ఈటీవీలో సీరియల్ ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే, తాను హైదరాబాద్‌లోని వేగవంతమైన వాతావరణానికి అలవాటు పడలేకపోయానని, తాను పెరిగిన చెన్నై వాతావరణం, హైదరాబాద్ సంస్కృతి చాలా భిన్నంగా ఉండేవని ఆమె వివరించారు. తన తండ్రి కుటుంబం హైదరాబాద్‌కు మారినప్పటికీ, తాను చెన్నైలోనే ఉండి తన పాఠశాల విద్యను పూర్తి చేశానని తెలిపారు. అందుకే, హైదరాబాద్‌లో ఆఫర్లు ఉన్నప్పటికీ, తాను తిరిగి చెన్నైకి వెళ్లి, అక్కడి నుంచే తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించానని చెప్పారు. గంగోత్రి, కలవారి కోడలు, నిన్నే పెళ్లాడతా వంటి అనేక ప్రసిద్ధ సీరియల్స్‌లో తాను ఒకేసారి నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సీరియల్ పరిశ్రమ హైదరాబాద్‌కు మారాల్సి వచ్చినప్పుడు, తాను అక్కడ స్థిరపడలేకపోయానని, చాలా మంది కోరినప్పటికీ సౌకర్యంగా లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయానని ఆమె అన్నారు.
శివ శ్రీకర్ ప్రసాద్ వ్యక్తిత్వం గురించి సంతోషి వివరిస్తూ, ఆయన స్నేహితులకు, సంబంధీకులకు ఏదైనా చేస్తారని, అయితే ఆయన కోపం ప్రెషర్ కుక్కర్ లాంటిదని, ఎప్పుడు బయటపడుతుందో తెలియదని అన్నారు. ఆయన కోపం బయటపడినప్పుడు ఎవరూ దగ్గరకు వెళ్లరని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, ఆయన తనను తాను చాలా మార్చుకున్నారని సంతోషి ప్రశంసించారు. తన విజయం వెనుక తన భర్త శివ శ్రీకర్ ప్రసాద్ ప్రధాన కారణమని సంతోషి చెప్పారు. ఒక స్త్రీ బయట విజయం సాధించాలంటే ముందు ఇంట్లో వారి మద్దతు, అనుమతి అవసరమని, తన విషయంలో ఆ మద్దతు తనకు లభించిందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన మామయ్య ప్రసాద్ సినీరంగంలో ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత సహయ నటుడిగా కనిపించారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..