Jagapathi Babu: ఆ స్టార్ హీరోకి ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు.. చిన్నవాడైనా గొప్ప మనసు: జగపతిబాబు

ఇప్పుడంటే సహాయక నటుడిగా, విలన్ గా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు జగపతి బాబు. అయితే కొన్నేళ్ల క్రితం ముందు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ పరంగా చాలా స్ట్రగుల్ అయ్యారీ సీనియర్ నటుడు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలుకావడంతో..

Jagapathi Babu: ఆ స్టార్ హీరోకి ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు.. చిన్నవాడైనా గొప్ప మనసు: జగపతిబాబు
Jagapathi Babu

Updated on: May 03, 2026 | 10:28 AM

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగారు జగపతి బాబు. వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా తెలుగు ఆడియెన్స్ అభిమానుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఒకానొక సమయంలో ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ పరంగా చాలా స్ట్రగుల్ అయ్యారు జగపతి బాబు. హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమాలతో కోట్లాది ఆస్తులు సంపాదించిన ఈ హీరో అప్పుల పాలయ్యాడని ప్రచారం కూడా జరిగింది. అయితే లెజెండ్ సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడీ సీనియర్ హీరో. అందులో పవర్ ఫుల్ విలన్ గా నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. దీని తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం విలన్‌గా, సహాయక నటుడిగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఒక వైపు పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్‌ సిరీస్‌ ల్లోనూ అదరగొడుతున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు హీరోప్రభాస్‌, రాజమౌళి ఫ్యామిలీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘హీరో ప్రభాస్‌కి ఇతరులకు ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు. ఎవరెలాంటి సాయం కావాలన్నా చేస్తాడు. నేను ఓ సారి డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కి ఫోన్‌ చేసి మాట్లాడాలని అడిగాను. అప్పుడు అతను జార్జియాలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ‘డార్లింగ్‌.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్‌ చెప్పు.. నేను తీరుస్తా’అని ధైర్యం చెప్పాడు. చెప్పినట్లుగానే జార్జియా నుంచి తిరిగి రాగానే నన్ను కలిశాడు. ఆ సయమంలో ప్రభాస్‌ చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పు నిచ్చాయి. అలాగే ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. వయసులో నా కంటె చిన్నవాడైనా గొప్ప మనసు తనది. అందరిని ప్రేమగా ఆదరిస్తాడు’ అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ .. ‘ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించిన రాజమౌళిలో ఏ మాత్రం గర్వం కనిపించదు. ఒకరో ఇద్దరు కాదు ఆయన ఫ్యామిలీ అంతా అలానే ఉంటుంది. అందరిని ప్రేమగా చూసుకుంటారు. వాళ్లు హాలీడే ట్రిప్‌లో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు. నా చుట్టమే కదా అని తన సినిమాలో పాత్ర అడిగే బాగోదు. రాజమౌళి కూడా అలా మొహమాటంతో ఛాన్సులు ఇచ్చే వ్యక్తి కాదు. తన సినిమాలో పాత్రకు ఎవరు సెట్‌ అవుతారో వారినే ఎంపిక చేసుకుంటారు. సినిమా విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకున్న చాలు.. మనం సక్సెస్ అవుతాం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us