
జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ నరేష్. తన కామెడీతో ప్రేక్షకులను అలరించే నటుడు నరేష్, తెర వెనుక తన ఆర్థిక ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను, సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. నరేష్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తన తొలి పారితోషికం రూ.500. ఒక చిన్న క్యారెక్టర్ కోసం రాకింగ్ రాకేష్ ఈ డబ్బులు చెల్లించారని ఆయన తెలిపాడు. ఆ తర్వాత ఒక స్కిట్‌కు రూ.1500 తో మొదలైన ఆయన పారితోషికం, ఒక సంవత్సరం తర్వాత రూ. 3000, ఆపై రూ.5000కు చేరుకుందని తెలిపాడు. టీమ్ లీడర్‌గా మారిన తర్వాతే కంపెనీ నుండి నేరుగా డబ్బులు అందాయని నరేష్ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల వరకు తాను చెప్పుకోదగ్గ సంపాదన ఏమీ చేయలేకపోయానని నరేష్ పేర్కొన్నాడు. ఆ నాలుగు సంవత్సరాల్లో తన తల్లికి కేవలం రూ.1 లక్ష విలువైన ఒక బంగారు గొలుసు మాత్రమే చేయించగలిగానని తెలిపాడు. ఈ సమయంలో తనను చూసిన వారందరూ “నాలుగేళ్లు అయ్యింది, మీవాడు ఏం సంపాదిస్తున్నాడు.?” అని అడిగిన రోజులు ఉన్నాయని తెలిపాడు.
సొంత ఇల్లు కట్టుకోవాలనే కల నరేష్ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. తన ఊరిలో ఉన్న రెండు ఎకరాల పొలాన్ని అమ్మకుండా, సొంతంగా రూ.20 లక్షల వరకు జమ చేసుకున్నారు. దీనికి అదనంగా చిట్టీలు కట్టి, చిన్న చిన్న మొత్తాలను పోగు చేసుకుంటూ రూ.36 లక్షల విలువైన ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి కొనుగోలు కోసం బయట రూ. 15 లక్షల అప్పు కూడా చేశారు. అయితే, ఆ భూమి రిజిస్ట్రేషన్ అయిన నాలుగైదు రోజులకే కరోనా లాక్‌డౌన్ విధించడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భూమిని అమ్మేద్దామా అని కూడా ఆలోచించానని నరేష్ తెలికిపాడు. బుల్లెట్ భాస్కర్ మరికొందరు స్నేహితుల సహాయంతో అప్పులు తీర్చి, ఆ సవాళ్లను అధిగమించడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని ఆయన తెలిపాడు.
ఈ కష్టాల నుండి కోలుకున్న తర్వాత, అదే ప్రాంతంలో మరో మూడు బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని తెలిసి,కొంత మొత్తాన్ని చెల్లించి, మిగతా దానికి లోన్ తీసుకొని నరేష్ తన సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాడు. నరేష్ ఆర్థిక నిర్వహణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తన అకౌంట్‌లో కేవలం రూ.2000-రూ.1000 మాత్రమే ఉంచుకుంటారు. మిగతా డబ్బునంతా తన తండ్రి అకౌంట్‌లో భద్రంగా ఉంచుతానని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం కార్డును వెంట తీసుకెళ్తానని, ఒకవేళ అది లేకపోతే తన తమ్ముడికి ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా వెంటనే డబ్బు పంపిస్తాడని, ఈ నమ్మకమే తన బలం అని నరేష్ వెల్లడించాడు.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.