
జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కామెడీతో టీవీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ తోపాటు పలు టీవీ షోల్లోనూ పాల్గొంటూ నవ్వులోను పూయిస్తున్నాడు భాస్కర్. కాగా ఓ ఇంటర్వ్యూలో భాస్కర్ చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తోటి కళాకారులతో సంబంధాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు ఈ జబర్దస్త్ నటుడు. తన జీవితానికి గుర్తింపునిచ్చింది జబర్దస్త్ షోనేనని, డబ్బుల కోసం కాకుండా దానికి కృతజ్ఞతగా ఇక్కడే కొనసాగుతున్నానని తెలిపారు. సినిమాల్లో అవకాశాల కోసం తాను కూడా ప్రయత్నించినట్లు బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే, ఎక్కడో గుంపులో గోవిందగా నిలబడి, డైలాగులు కూడా లేని పాత్రలు చేయడం కంటే, ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించి బ్రేక్ పొందాలని ఉందని తెలిపాడు. మొదట ఆర్థికంగా స్థిరపడటం ముఖ్యమని, అందుకే ఈవెంట్లు, పబ్లిక్ షోలపై దృష్టి సారించానని తెలిపాడు.
ప్రస్తుతం ఈవెంట్లలో తమ టీమ్ నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇవి ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయని అన్నారు. డబ్బులు సంపాదించిన తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పారు. చలాకీ చంటికి టీమ్ మద్దతు ఇవ్వలేదనే ఆరోపణలపై బుల్లెట్ భాస్కర్ స్పందిస్తూ.. చంటి తన సమస్యను నేరుగా చెప్పి ఉండకపోవచ్చని.. జబర్దస్త్ లోని కళాకారులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఎవరికి కష్టం వచ్చినా వాట్సాప్ గ్రూపుల ద్వారా డబ్బులు సమకూర్చుకుంటారని తెలిపాడు భాస్కర్. ఈ విషయంలో గెటప్ శ్రీను, అదిరే అభి వంటివారు ముందుంటారని, వారు త్వరగా రెస్పాండ్ అయ్యి సాయం చేస్తారని ప్రశంసించాడు. అలాగే ప్రసాద్ అన్నకు కష్టం వచ్చినప్పుడు కూడా అందరూ రెస్పాండ్ అయ్యారని తెలిపాడు భాస్కర్.
తన తండ్రికి తనకంటే ఎక్కువ పేరు వచ్చిందని, ఆయనకు అమెరికాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, ఆయన ఇంటర్వ్యూలలో నోటికొచ్చింది మాట్లాడతారని, అందుకే మధ్యలోనే ఆపేశానని సరదాగా చెప్పాడు. జబర్దస్త్ లో రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్న రోజులు తమ అదృష్టమని, ఆ సమయంలో పనిచేయడం వల్లే తమకు ఇంత పేరు వచ్చిందని బుల్లెట్ భాస్కర్ అన్నారు. వైజాగ్ నుండి వచ్చిన కళాకారులైన తాను, రామ్ ప్రసాద్, అప్పారావు వంటివారు జబర్దస్త్ లోనే కలుసుకున్నామని, బయట ఎవరికీ ఎవరి గురించి తెలియదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సెలబ్రిటీ జీవితానికి దూరంగా, సాదాసీదా జీవితాన్ని గడుపుతానని, పని, కుటుంబం తప్ప తనకు వేరే ప్రపంచం తెలియదని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.