Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. రంగంలోకి విక్రమ్‌ను దింపుతోన్న రాజమౌళి

|

Aug 30, 2024 | 7:59 PM

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. రంగంలోకి విక్రమ్‌ను దింపుతోన్న రాజమౌళి
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాతర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే కొంతమందిని రాజమౌళి సంప్రదించారట కూడా..

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!

ఈ క్రమంలోనే చియాన్ విక్రమ్‌ నటిస్తున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు కోసం చియాన్ విక్రమ్‌ని రాజమౌళి సంప్రదించినట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. దాన్ని ఎవరూ ఖండించలేదు. అలా అని దీని పై క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి విక్రమ్ మాట్లాడారు. తాజాగా తంగలాన్ ప్రమోషనస్ లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి విక్రమ్‌ను అడిగారు సినిమా జర్నలిస్ట్‌‌‌లు దీనికి విక్రమ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

మేము ఎప్పుడూ ఏదో ఒక చర్చలో ఉంటాము. రాజమౌళి దేశంలోనే అతిపెద్ద మరియు ఉత్తమ దర్శకుడని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ రాజమౌళితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని విక్రమ్ అన్నారు. అలాగే ‘ఎవరైనా అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. అది జరుగుతుందని ఆశిస్తున్నాము. సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాం అని విక్రమ్ చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు మహేష్ సినిమాలో విక్రమ్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అని అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా అని టాక్. అలాగే పలువురు అంతర్జాతీయ స్టార్స్ కూడా ఇందులో నటించనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.