Yellamma: నో చెప్పిందట.. ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఎల్దండి. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో నవ్వించిన వేణు.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఫేమస్ అయ్యాడు. అటు సినిమాలు.. ఇటు కామెడీ షోలతో అలరించిన వేణు.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు.

Yellamma: నో చెప్పిందట.. ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
Yellamma

Updated on: Mar 19, 2026 | 4:14 PM

బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు వేణు ఎల్దండి. కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన వేణు ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించారు. అలాగే జబర్దస్త్ కామెడీ షోలోనూ ఎన్నో స్కిట్స్ చేసి ఆకట్టుకున్నాడు వేణు. ఇక దర్శకుడిగా మారి బలగం సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చక్కగా చూపించాడు వేణు. బలగం సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్నది మొన్నటి వరకు ఆసక్తికరంగా సాగింది. నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరులు వినిపించినా కూడా చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో దేవీ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఎల్లమ్మ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి వేణు తెలంగాణ నేపథ్యంలో సినిమా చేస్తుండటంతో హీరోయిన్ ఎవరు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

కాగా అందాల భామ కీర్తిసురేష్ పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. గతంలో నాని నటించిన దసరా సినిమాలో కీర్తి తెలంగాణ అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ అమ్మడు ఎల్లమ్మలో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ కీర్తిసురేష్ ఎల్లమ్మకు నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. మొదట్లో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. ఆతర్వాత కీర్తిసురేష్ పేరు వచ్చింది. ఆమె కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. ఎల్లమ్మ టీమ్ మరోసారి హీరోయిన్ వేటలో పడిందని తెలుస్తుంది. మరి ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us