వారణాసిలో స్టార్ హీరో వారసుడు.. మహేష్ చిన్ననాటి పాత్రలో ఆ హీరో కొడుకు..? ఫ్యాన్స్‌కు పూనకాలే

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ 2027 లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది .

వారణాసిలో స్టార్ హీరో వారసుడు.. మహేష్ చిన్ననాటి పాత్రలో ఆ హీరో కొడుకు..? ఫ్యాన్స్‌కు పూనకాలే
Varanasi

Updated on: Jul 11, 2026 | 12:45 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి సినిమాపై ఇప్పటికే  భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారమే చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు జక్కన్న.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అని తెలిపారు రాజమౌళి. దాంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. అలాగే ఈ మూవీలో మహేష్ బాబు పలు డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. రాముడిగా అద్భుతంగా ఉన్నాడని రాజమౌళి తెలిపారు.

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

అయితే ఇప్పుడు వారణాసి సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ హీరో కొడుకు నటించనున్నాడని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ వెండితెరపై కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కనిపించనున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ కు రాజమౌళికి మధ్య మంచి స్నేహం, అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.. రాజమౌళి కోరిక మేరకు మహేష్ చిన్ననాటి పాత్ర కోసం తారక్ తనయుడిని రంగంలోకి దింపనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us